News March 18, 2024

OTTలో రికార్డు సృష్టించిన ‘హనుమాన్’

image

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు జీ5 వెల్లడించింది. ఈ ఏడాది ఇదే రికార్డని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండింగ్ అవుతోందని పేర్కొంది. కాగా థియేటర్లలో ఈ మూవీ దాదాపు రూ.350 కోట్లను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

News March 18, 2024

ఫోన్‌లోనే ఓటర్ IDలో పేరు మార్చుకోవచ్చు

image

ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫాం-8 నింపి ఓటరు కార్డులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అందులో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, పుట్టిన తేదీ, తండ్రి/భర్త పేరు, లింగం వంటివి ఉంటాయి. వాటిని మార్చుకొనేందుకు సంబంధిత కొన్ని ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
> https://voterportal.eci.gov.in

News March 18, 2024

అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: CM జగన్

image

AP: వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ‘అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. “సిద్ధం” సభల తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.

News March 18, 2024

బ్యాటర్‌గా బరిలోకి దిగనున్న రాహుల్!

image

క్రికెటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో బెంగళూరులోని NCAలో చేరారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో ఈ ఐపీఎల్ ఆడేందుకు అతడికి ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లకు కీపింగ్ చేయొద్దని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. రాహుల్ LSGకి కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News March 18, 2024

ఈ నెల 26న ‘మగధీర’ రీరిలీజ్!

image

రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కి సంచలనం సృష్టించిన మూవీ ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌లో రికార్డులను తిరగరాసింది. ఈ నెల 26న చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మరోసారి ఈ మాస్టర్ పీస్‌ను చూసే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

News March 18, 2024

రూ.1.5లక్షలు లంచం తీసుకుంటూ..

image

TS: హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారి ఎం. శ్రీనివాసరావు ఏసీబీ వలలో చిక్కారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఓ టీ షాపును, ‘చెన్నపట్నం చీరలు’ బోర్డును కూల్చివేయకుండా ఉండేందుకు ఆయన శ్రీరాములు అనే వ్యక్తి వద్ద రూ.1.5లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

News March 18, 2024

సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకంటే?

image

ఉత్త‌ర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి రూ.35వేలు అందిస్తోంది. ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయానికి వరుడిని తెచ్చుకోకపోవడంతో మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. ఆమెకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్‌గంజ్‌ అధికారులు షాకయ్యారు.

News March 18, 2024

శారీ రన్‌లో పాల్గొనడం గర్వకారణం: బ్రాహ్మణి

image

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిన్న శారీ రన్ కార్యక్రమాన్ని తాను జెండా ఊపి ప్రారంభించడం సంతోషంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ‘ధగధగ మెరిసిపోయే, కళాత్మకంగా నేసిన ముచ్చటైన చీరల్లో వందలాది మహిళలను చూడటం ఎంతో బాగుంది. చేనేతకు ప్రఖ్యాతిగాంచిన మంగళగిరిలో శ్రమ, ప్రేమ కలగలిపి అక్కడి మహిళలు అల్లిన చేనేత చీరను ధరించి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం’ అని ఆమె ట్వీట్ చేశారు.

News March 18, 2024

ఆ పార్టీకి రూ.5 కోట్ల విరాళాలు ఇచ్చిన సీఎస్కే యాజమాన్యం

image

ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు వచ్చిన విరాళాల జాబితాను ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK యాజమాన్యం మెజారిటీ విరాళాలను అందజేసింది. ఆ పార్టీకి రూ.6.05 కోట్లు విరాళాలు రాగా, వాటిలో సీఎస్కే యాజమాన్యమే రూ.5 కోట్లు ఇచ్చినట్లు ఈసీ గణాంకాలు పేర్కొన్నాయి. 2019 ఏప్రిల్‌లో ఈ విరాళాలు ఇవ్వడం గమనార్హం.

News March 18, 2024

భారత్-చైనా సరిహద్దులో జవాన్ల కోసం స్పెషల్ బంకర్స్

image

చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వద్ద గడ్డకట్టే చలిలోనూ మన జవాన్లు గస్తీ కాస్తుంటారు. అందుకే వారి కోసం కేంద్రం పెద్ద ప్రత్యేక బంకర్లను నిర్మిస్తోంది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ బంకర్లు -30 డిగ్రీల్లోనూ 22 డిగ్రీల వెచ్చని వాతావరణం కల్పిస్తాయట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు చోట్ల ఏర్పాటైన ఈ బంకర్లను ఇప్పుడు ప్రభుత్వం ఆధునీకరించి మరిన్ని చోట్లకు విస్తరిస్తోంది.