News March 19, 2024

నేడు కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌తో పాటు మహిళలను ఈడీ ఆఫీసుకు విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది. ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఇవాళ మూడో రోజు ఈడీ ఆమెను పలు అంశాలపై ప్రశ్నించనుంది.

News March 19, 2024

ఏపీలో 83 శాతం పోలింగ్ లక్ష్యం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 83 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు SEC వెల్లడించింది. 2019లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. పట్టణాలు, ఏజెన్సీల్లో యువతలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. గత ఎన్నికల్లో అత్యల్పంగా విశాఖ వెస్ట్‌లో 56.3 శాతం పోలింగ్ నమోదైంది.

News March 19, 2024

హౌతీల దాడిలో సముద్రంలో మునిగిపోయిన నౌక

image

హౌతీల దాడిలో యూకేకు చెందిన రూబీమార్ అనే వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న 21,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ సముద్రం పాలయ్యాయి. దాదాపు 30 కి.మీ మేర సముద్రంపై చమురు తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో అందులోని జీవరాశులకు ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలకు, పగడపు దిబ్బలకు పర్యావరణ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.

News March 19, 2024

పిచ్చి వేషాలు వేస్తే టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది: వైసీపీ

image

AP: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి <<12880443>>నోటీసులు<<>> ఇవ్వడంపై వైసీపీ Xలో స్పందించింది. ‘టీడీపీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. సీఎం జగన్‌ను అవమానించేలా టీడీపీ Xలో పోస్టు వేసింది. ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్టును డిలీట్ చేసింది. ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్టులు కాదు టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది.

News March 19, 2024

22 నుంచి చంద్రబాబు ‘ప్రజాగళం’ యాత్ర!

image

AP: ఈ నెల 22 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారట.

News March 19, 2024

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?

image

AP: ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా.. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయి.

News March 19, 2024

టీసీఎస్‌లో టాటా సన్స్ వాటా విక్రయం?

image

తమ సాఫ్ట్‌వేర్ విభాగమైన టీసీఎస్‌లో 0.64 శాతం వాటాను టాటా సన్స్ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సమానమైన 2.3 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.4001 చొప్పున బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో రూ.9202 కోట్లకు పైగా నిధులను సమకూర్చుకోనుంది. గత డిసెంబరు నాటికి టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 72.38శాతం వాటా ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబరుకల్లా ఆ సంస్థ ఐపీఓకు రావొచ్చని అంచనా.

News March 19, 2024

హైదరాబాద్ కెప్టెన్ వచ్చేశాడు

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని SRH ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రైనింగ్ క్యాంప్ ఇప్పటికే ప్రారంభమైంది. జట్టులోని ఇతర ఆటగాళ్లందరూ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది.

News March 19, 2024

ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మోస్తరు వానలు

image

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

News March 19, 2024

విరుష్క జంట బ్రిటన్‌లో సెటిల్?

image

టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు బ్రిటన్‌లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క చాలా కాలం నుంచి అక్కడే ఉంటున్నారు. రెండో బిడ్డ అకాయ్‌కూ అక్కడే జన్మనిచ్చారు. పిల్లల ప్రైవసీ కోసం ఈ జంట అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నట్లు సమాచారం. భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే కోహ్లీ ఇండియాకు వస్తారని టాక్.