India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉ.9.30 గంటల నుంచి మ.12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. మ.ఒంటిగంట నుంచి సా.5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఇటీవల ఆయా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ తాజాగా వాటిని రద్దు చేసింది. జాతీయ, మతపరమైన సెలవు దినాల్లో మినహా మిగిలిన సెలవు రోజుల్లోనూ APR 23 వరకు ఒంటిపూట తరగతులు ఉండనున్నాయి.
దేశంలో లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనున్నారు. దేశంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రాంతాలకు ఒకేసారి చేరుకోవడం సాధ్యం కాదని, అందుకే 7దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. భద్రతా దళాలపై ఉండే ఒత్తిడిని కూడా ఆలోచించాలని అన్నారు. దీంతో పాటు హోలీ, రంజాన్, రామనవమి పండుగలు ఉన్నాయని, అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘నేను ఇంతకముందే చెప్పాను. మళ్లీ చెబుతున్నా. సినీ పరిశ్రమలో గురువు అనే పదానికి నిలువెత్తు రూపం గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు. ప్రతిభతో ఆయన ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతరుల స్క్రిప్టులు హైజాక్ చేసినట్లు ఆ పేరును హైజాక్ చేయలేరు’ అని పేర్కొంటూ దాసరితో దిగిన ఫొటోను షేర్ చేశారు.
TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 4.03లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క పోస్టుకు దాదాపు 715 మందికి పైగా పోటీ పడుతున్నారు. 2022 నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి 23 వేల అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. దరఖాస్తుల సవరణకు ఈనెల 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహించనున్నారు.
నిర్మల (జగ్గారెడ్డి సతీమణి) – పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
నేరెళ్ల శారద – మహిళా కమిషన్
బండ్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి సంస్థ
పొదెం వీరయ్య- అటవీ అభివృద్ధి సంస్థ
శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ
జగదీశ్వర్‌రావు – ఇరిగేషన్ డెవలప్‌మెంట్
రాయల నాగేశ్వరరావు – గిడ్డంగుల సంస్థ
ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన కుట్రదారుల్లో ఎమ్మెల్సీ కవిత ఒకరని పేర్కొన్న ఈడీ.. ఆమె రూ.192.8కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు రూ.100కోట్లు ఆప్ నేతలకు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.
AP: మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ సెలవులపై విధించిన నిబంధనను ప్రభుత్వం తొలగించింది. వారు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపే ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉంది. తాజాగా దీన్ని ఎత్తేసిన ప్రభుత్వం.. రిటైరయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
రష్యాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి పుతిన్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుతిన్ ప్రధాన ప్రత్యర్థి నావల్నీ చనిపోవడం, కొంతమంది ప్రత్యర్థులు జైళ్లు, అజ్ఞాతంలో ఉండడంతో ఆయన సులువుగా విజయం సాధిస్తారని తెలుస్తోంది. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నా వారు నామమాత్ర ప్రత్యర్థులేనని టాక్.
బంగారం దిగుమతి విషయంలో ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దిగుమతి సుంకం చెల్లించకుండానే బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం దిగుమతిపై 15%సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం తాజాగా నిర్ణయంతో ఈ సుంకం భారం తగ్గనుంది.
సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమల దర్శనంపై పడింది. ఇకపై తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది. స్వయంగా వచ్చే సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సిఫారసు లేఖలు చెల్లవు.
Sorry, no posts matched your criteria.