News March 16, 2024

SRH కెప్టెన్‌గా పాట్ కమిన్స్ రాణిస్తారు: స్మిత్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రాణిస్తారని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ హెడ్ కోచ్ వెటోరీ ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌ కూడా. ఆయనతో కమిన్స్‌కు చక్కటి అనుబంధం ఉంది. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారీ కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈసారి SRH రాణిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని స్మిత్ వ్యాఖ్యానించారు.

News March 16, 2024

రేపు గ్రూప్-1 పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్: సీఎస్

image

AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్‌ను నియమించామని పేర్కొన్నారు.

News March 16, 2024

ALERT: రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్లకండి

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ఒకవేళ ఉంటే.. కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. తనిఖీల్లో దొరికితే పోలీసులు డబ్బును సీజ్ చేస్తారు. బంగారం, వెండి వంటి ఆభరణాలు సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తే రోగి రిపోర్టులు, రసీదులను చూపించాలి.

News March 16, 2024

కవితకు ఇంటి నుంచి భోజనం

image

కవితకు 7 రోజుల కస్టడీ విధించిన కోర్టు.. ఆమె అడిగిన కొన్ని మినహాయింపులకు అంగీకరించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను, లాయర్లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కూడా ఒకే చెప్పింది. కాగా కవితను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు.

News March 16, 2024

విచారణలో కవిత ఏం చెప్పనున్నారు?

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆమెకు కోర్టు కస్టడీ విధించడంతో ఈడీ కవితను విచారించనుంది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ఆరా తీయనుంది. గతంలో ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డితో ఆమెకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించనుంది. అయితే ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News March 16, 2024

కవిత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాలు పొందుపర్చింది. ‘లిక్కర్ కేసు కీలక సూత్రధారుల్లో కవిత ఒకరు. మాగుంట రాఘవ, శ్రీనివాసులురెడ్డి, శరత్‌చంద్రారెడ్డితో కలిసి ఆమె సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు’ అని పేర్కొంది.

News March 16, 2024

ఎలక్షన్ కోడ్ రూల్స్..

image

➥ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల పోస్టర్లు తొలగించాలి
➥ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి
➥పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్‌సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగింపు
➥ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేత
➥అధికారుల బదిలీలపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.

News March 16, 2024

BREAKING: కవితకు హైబీపీ

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితకు హైబీపీ ఉందని ఆమె లాయర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి రక్తపోటు లేదని కోర్టుకు వెల్లడించారు. ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ కారణంగా ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 7 రోజుల ED కస్టడీలో అవసరమైన మెడిసిన్, దుస్తులు, ఫుడ్ అందించవచ్చని లాయర్‌కు తెలిపింది.

News March 16, 2024

క్రిమినల్ కేసులుంటే పార్టీ వెబ్‌‌సైట్‌లో వివరాలు పెట్టాలి: CEC

image

AP: అభ్యర్థులు క్రిమినల్ కేసులుంటే పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర CEC ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘క్రిమినల్ కేసులుంటే ఆయా పార్టీల వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచాలి. రాష్ట్రంలో 46 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత పెంచుతాం. 4లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు.

News March 16, 2024

కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.