News March 16, 2024

భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 2/2

image

ఈ అరుదైన ఘటనతో 24లక్షల ఏళ్లకు ఓసారి భూ వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయట. ఓ గ్రాండ్ సైకిల్‌లో భూమికి ఎక్కువ సూర్యకాంతి తగులుతూ, తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే మరో సైకిల్‌లో సూర్యకాంతి తగ్గి, శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. భూ అవక్షేపాలపై పరిశోధనతో ఈ విషయాలను కనుగొన్నారు. సముద్ర గర్భాన మార్పులు, గతకొన్నేళ్లలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తమ పరిశోధనకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

News March 16, 2024

బీఎస్పీని వీడుతున్నా: RS ప్రవీణ్ కుమార్

image

TG: BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘నిన్న బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు(కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా’ అని ట్వీట్ చేశారు.

News March 16, 2024

రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తా: YSJ

image

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్లేలా అడుగులు వేస్తాం’ అని CM జగన్ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ట్వీట్‌లో తెలిపింది. వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీల స్థానాలపై మీ కామెంట్?

News March 16, 2024

ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు

image

వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.

News March 16, 2024

వైసీపీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు

image

AP: వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.

News March 16, 2024

పోటీలో ఆరుగురు మాజీ సీఎంల తనయులు

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మాజీ CMల తనయులు పోటీలో ఉన్నారు. YSR తనయుడు జగన్ పులివెందుల నుంచి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ (TDP) డోన్ నుంచి, సీనియర్ NTR తనయుడు బాలకృష్ణ (TDP) హిందూపురం, చంద్రబాబు వారసుడు లోకేశ్ (TDP) మంగళగిరి, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (JSP) తెనాలి నుంచి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్ (YCP) వెంకటగిరి నుంచి పోటీలో ఉన్నారు.

News March 16, 2024

ఉమ్మడి ప.గో. వైసీపీ అభ్యర్థులు వీరే..

image

*తణుకు- కారుమూరి వెంకట నాగేశ్వరరావు
*తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
*ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
*దెందులూరు- కొటారు అబ్బయ్యచౌదరి
*ఏలూరు- ఆళ్ల నాని
*గోపాలపురం- తానేటి వనిత
*పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి
*చింతలపూడి- కంభం విజయరాజు

News March 16, 2024

కవిత అరెస్ట్ ఒక నాటకం: సీఎం రేవంత్

image

TG: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ BJP, BRS కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. PM మోదీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

News March 16, 2024

కవిత కేసు విచారణ వాయిదా

image

TG: MLC కవిత కేసు విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఆమెతో మాట్లాడేందుకు న్యాయవాదులకు జడ్జి అనుమతినిచ్చారు. దీంతో కోర్టు హాలులో ఆమెతో న్యాయవాదులు భేటీ అయ్యారు.

News March 16, 2024

ఉమ్మడి ప్రకాశం YCP అభ్యర్థులు వీరే..

image

☛ యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్ ☛ దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
☛ పర్చూరు – ఎడం బాలాజీ , చీరాల- కరణం వెంకటేశ్ ☛ అద్దంకి – హనిమిరెడ్డి
☛ సంతనూతలపాడు – మేరుగు నాగార్జున ☛ ఒంగోలు – బాలినేని శ్రీనివాస్ రెడ్డి , ☛ కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్ ☛ కొండపి – ఆదిమూలపు సురేశ్, ☛ మార్కాపురం – అన్నా రాంబాబు ☛ గిద్దలూరు – కె.నాగార్జునరెడ్డి
☛ కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్