India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటకలోని హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కేసు నమోదైంది. సూరజ్ ఈనెల 16న తనను ఫామ్ హౌస్‌కి పిలిచి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహకరించకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సూరజ్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే మహిళపై లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.
రేపు(ఆదివారం) జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు NTA ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను కేంద్రం ఇవాళ పదవి నుంచి తొలగించింది.
TG: కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రానికి కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాది ఈ విభాగంలో 1.4% నిధులే వచ్చాయన్నారు. ‘జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఉపాధి హామీ నిధులను ఆస్తుల సృష్టి పనులకు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. TGలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి’ అని కోరామన్నారు.
రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు పడే జిల్లాల జాబితాను పైన ఫొటోలో చూడొచ్చు.
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచారు. 40 ఇన్నింగ్స్‌లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది (39 వికెట్లు), లసిత్ మలింగా (38), హసరంగా (37), సయీద్ అజ్మల్ (36), టిమ్ సౌథీ (36) ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 37 వికెట్లు తీశారు.
T20WC సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 196/5 స్కోర్ చేసింది. హార్దిక్ 27 బంతుల్లో 50*(3 సిక్సులు, 4 ఫోర్లు) పరుగులతో అదరగొట్టారు. కోహ్లీ 37, పంత్ 36, దూబే 34, రోహిత్ 23, సూర్య 6 పరుగులు చేశారు. తంజిమ్ హసన్, రిషాద్ చెరో 2 వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.
భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు వివరించారు.
AP: రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాలన్నారు. తన నివాసంలో అటవీ శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ప్రతి జిల్లాలోని కాలుష్యం లెక్కలు తీయాలని, జల, వాయు కాలుష్యాల వివరాలు అందించాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల శుద్ధీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.
మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2 కోచ్‌లు ఉన్న రైళ్లలో 4కు, జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు 2 బోగీలను సమకూరుస్తామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, అదనంగా 2,500 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఒక్కో కోచ్‌లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.
AP: పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయని కొన్ని ఛానళ్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని వైసీపీ తెలిపింది. ‘జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కార్యకర్తలు ఆగ్రహించారని ఆ మీడియా పిచ్చిరాతలు రాసుకుంది. జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చిన విషయాన్ని మరుగునపరచడానికి, వక్రీకరించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.