News June 20, 2024

తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: BRS

image

తెలంగాణకు హోం మంత్రే కాదు విద్యాశాఖ మంత్రి కూడా లేరని Xలో BRS సెటైరికల్ ప్రకటన జారీ చేసింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 200 రోజులు అవుతున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ విద్యాలయాల అవసరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. అందుకే వెంటనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను’ అని ట్వీట్ చేసింది.

News June 20, 2024

వందేభారత్: మీల్స్‌లో బొద్దింక ప్రత్యక్షం

image

వందేభారత్ ట్రైన్‌లో భోపాల్ నుంచి ఆగ్రాకు వెళుతున్న ఓ జంటకు మీల్స్‌లో బొద్దింక వచ్చింది. దీంతో విదిత్ అనే యువకుడు విషయాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆంటీ-అంకుల్ ఆర్డర్ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని Xలో కోరారు. స్పందించిన రైల్వేశాఖ క్షమాపణలు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

News June 20, 2024

లోక్‌సభలో ప్రతిపక్ష నేతను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది: శరద్ పవార్

image

ఇండియా కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ నాయకునికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని NCP-SP చీఫ్ శరద్ పవార్ చెప్పారు. ఆ మేరకు 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీనే విపక్ష నేతను నిర్ణయిస్తుందన్నారు. ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, అందుకే సీట్లు భారీగా తగ్గిపోయాయని చెప్పారు. కాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును CWC ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News June 20, 2024

లోక్‌సభ స్పీకర్ ఎందుకంత కీలకం?

image

సభలో కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం స్పీకర్ బాధ్యత. మంత్రులు, ఎంపీలంతా స్పీకర్ మాట వినాల్సిందే. పార్టీ ఫిరాయించే సభ్యులను అనర్హులుగా స్పీకర్ ప్రకటించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే సస్పెండ్ చేస్తారు. ఏదైనా తీర్మానంపై ఇరువైపులా సమాన ఓట్లు పడితే స్పీకర్ ఓటు కీలకంగా మారుతుంది. దీంతో పాటు పార్లమెంటరీ సమావేశాల అజెండాను నిర్ణయించేది స్పీకరే. అందుకే ఈ పదవికి అంత ప్రాధాన్యత.

News June 20, 2024

కూటమి విజయం అందరిదీ: పురందీశ్వరి

image

AP: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం అందరి విజయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. ‘ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. మూడు పార్టీల జెండాలు, ఎజెండాలు వేరైనా కలిసికట్టుగా పనిచేశాం. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారు. కూటమిని ఆదరించారు’ అని ఆమె పేర్కొన్నారు.

News June 20, 2024

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గుతున్నాయ్

image

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్న మొత్తం 1.04B Sfr(₹9,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. అక్కడ విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు వివరించింది. తొలి 3 స్థానాల్లో బ్రిటన్(254B Sfr), US(71B Sfr), ఫ్రాన్స్(67B Sfr) ఉన్నాయి.

News June 20, 2024

మూడో అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా భారత్

image

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా భారత్ నిలిచింది. పదేళ్ల కిందట 8 మిలియన్ సీట్ల కెపాసిటీతో ఐదో స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 15.6 మి. సీట్ల సామర్థ్యంతో థర్డ్ ప్లేస్‌కు చేరింది. తొలి 2 స్థానాల్లో US, చైనా ఉండగా, 4, 5 ప్లేస్‌లలో బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి. భారత్ ఏడాదికి సగటున 6.9% వృద్ధి సాధిస్తోందని, ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని OAG డేటా వెల్లడించింది.

News June 20, 2024

‘కల్కి’ రన్ టైమ్: 3 గంటల 56 సెకన్లు

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా.. మొత్తం 3గంటల 56 సెకన్లు రన్ టైమ్ ఉండనుంది. సినిమా మొత్తాన్ని పరిశీలించాక సెన్సార్ బోర్డు ప్రతిపాదన మేరకు 1.36 నిమిషాల సీన్స్‌ను రీప్లేస్‌మెంట్ చేసినట్లు సర్టిఫికెట్‌లో ఉంది. ఈనెల 27న ‘కల్కి’ రిలీజ్ కానుండగా త్వరలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

News June 20, 2024

మౌలిక వసతులపై కేంద్రం పెట్టుబడితో స్టాక్ మార్కెట్లకు జోష్?

image

దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న PM గతిశక్తి వంటి ప్రాజెక్టులతో స్టాక్ మార్కెట్లకు బలం చేకూరుతోందని మోర్గాన్ స్టాన్లీ సంస్థ వెల్లడించింది. L&T, NTPC, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ వంటి సంస్థలు లబ్ధిపొందుతున్నాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణమూ తగ్గొచ్చని పేర్కొంది. FY29కి GDPలో మౌలిక రంగానికి సంబంధించిన పెట్టుబడులు 6.5శాతానికి చేరుతాయనేది మార్కెట్ వర్గాల అంచనా.

News June 20, 2024

రూపాయి పడిపోతోంది!

image

US డాలర్ దెబ్బకు భారతీయ రూపాయి మరింత దిగజారింది. ఈరోజు ఓ దశలో జీవితకాల కనిష్ఠాన్ని (₹83.68) తాకి ‌మార్కెట్లు ముగిసే సమయానికి 17 పైసల నష్టంతో 83.61 వద్ద స్థిరపడింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 2నెలల కనిష్ఠానికి పడిపోయింది. చివరగా ఈ విలువ ఏప్రిల్ 16న నమోదైంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, ఆయిల్ ధరలు పెరగడంతో డాలర్ విలువ పెరిగి మిగతా కరెన్సీల పతనానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.