India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* మేడ్చల్ DCP – కోటిరెడ్డి
* ఆదిలాబాద్ PTC SP – లిఖితా పంత్
* సికింద్రాబాద్ రైల్వే SP – చందనా దీప్తి
* సెంట్రల్ జోన్ DCP – షేక్ సలీమా
* నార్త్ జోన్ DCP – లక్ష్మీ పెరుమాళ్
* వెస్ట్ జోన్ DCP – రాజమహేంద్రనాయక్
* మంచిర్యాల DCP – భాస్కర్
* శంషాబాద్ DCP – రాజేశ్
* వికారాబాద్ SP – నారాయణరెడ్డి
రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HYD ట్రాఫిక్ DCPగా రాహుల్ హెగ్డే, జగిత్యాల SPగా అశోక్ కుమార్, సూర్యపేట SPగా సన్‌ప్రీత్ సింగ్, గద్వాల SPగా శ్రీనివాసరావు, MBNRకు SPగా జానకీ ధరావత్, ఆసిఫాబాద్ SPగా డీవీ శ్రీనివాసరావు, బాలనగర్ DCPగా సురేశ్, సైబర్ సెక్యూరిటీ SPగా హర్షవర్ధన్, CID SPగా విశ్వజిత్, ACB జాయింట్ డైరెక్టర్‌గా సాయి చైతన్య ఉంటారు.
AP: రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు అందించనున్నట్లు తెలిపింది. ఎంత మొత్తంలో అనేది త్వరలో వెల్లడి కానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం.
T20WC గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుపై కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జట్టులో ఐక్యత లేదు. అంతా విడిపోయారు. దీన్ని ఎవరూ జట్టు అనరు. నేను చాలా జట్లతో పని చేశాను. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే పాలిటిక్స్‌తో నిండిన పాక్‌ను విజేతగా నిలిపేందుకు గ్యారీ కిర్‌స్టెన్ ఏమీ మాంత్రికుడు కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్ కనేరియా చెప్పుకొచ్చారు.
AP: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది.
TG: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కె.కేశవరావు స్థానంలో సురేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ దక్కలేదు.
ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి తక్కువ టైమ్ ఉన్నప్పుడు ఈక్విటీలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత చదువులకు 2-3 ఏళ్లే ఉంటే ఒడుదొడుకులకు అవకాశం ఉన్న ఈక్విటీల్లో పొదుపు సరికాదంటున్నారు. మార్కెట్ క్రాష్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒకవేళ ఏళ్లుగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టినా టైమ్ దగ్గరపడినప్పుడు కొంత FD చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
AP: రేపు పార్వతీపురం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
ప్రియాంకా గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. <<13459064>>వయనాడ్<<>> ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆమె 2004 UP పార్లమెంట్, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, అమేథీలో మాత్రమే ప్రచారం చేశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. AICC జనరల్ సెక్రటరీగా నియమితులై యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.
TG: డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించడం గందరగోళానికి దారి తీస్తోంది. టెట్ ఫీజు భారీగా పెంచడంతో డీఎస్సీకి ఫ్రీగా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇస్తామని అధికారులు గతంలోనే చెప్పారు. అయితే ఈ నెల 12 నుంచి DSC అప్లికేషన్లు ప్రారంభం కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి సైట్‌లో మార్పులు చేసి, ఉచితానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే రూ.1,000 ఫీజు చెల్లించిన వారు రీఫండ్ చేయాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.