News June 15, 2024

చైనాతో వివాదం.. నష్టపోతున్న ఎలక్ట్రానిక్స్ రంగం?

image

చైనాతో దౌత్య సంబంధాలు క్షీణించడంతో భారత్‌లోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం నష్టపోతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగేళ్లలో లక్ష ఉద్యోగాలు పోగా, $15 బిలియన్ల ప్రొడక్షన్ లాస్ వచ్చిందని వెల్లడించాయి. దాదాపు 5వేల మంది చైనా ఎగ్జిక్యూటివ్‌ల వీసా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ ప్రభావం వ్యాపార విస్తరణపై పడుతోందని తెలిపాయి. సాధారణ పరిస్థితులు ఉండుంటే భారతీయ సంస్థలకు 23% వరకు వృద్ధి ఉండేదట.

News June 15, 2024

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పవన్

image

AP: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది’ అని అన్నారు.

News June 15, 2024

ఆలౌట్లలో T20 WC-2024 రికార్డు

image

T20 WC చరిత్రలో 100 కంటే తక్కువ స్కోర్లకు అత్యధిక ఆలౌట్లు నమోదైన టోర్నీగా WC-2024 నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లో 100 కంటే తక్కువ రన్స్‌కే జట్లు ఆలౌటయ్యాయి. 2014, 2021లో 8సార్లు, 2010లో 4సార్లు వంద పరుగుల కంటే తక్కువ ఆలౌట్ స్కోర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఇప్పటివరకు SL 77, ఉగాండా 58, 40, 39, ఐర్లాండ్ 96, PNG 77, 95, NZ 75, NAM 72, ఒమన్ 47 రన్స్‌కే కుప్పకూలాయి.

News June 15, 2024

రూ. 83 లక్షల జీతం వదులుకుని.. షెఫ్‌గా సెటిల్!

image

అమెరికాలోని సియాటెల్‌కు చెందిన వాలెరీ వాల్కోర్ట్(34) ఏడాదికి రూ.83 లక్షల జీతం సంపాదించేవారు. కానీ ఆత్మసంతృప్తి లేక ఆ కొలువు వదిలేసి ఫ్రాన్స్‌లో ఓ పేస్ట్రీ తయారీ షెఫ్‌కు సహాయకురాలిగా చేరిపోయారు. ఆమె కథ సియాటెల్‌లో చర్చనీయాంశంగా మారింది. లక్షల జీతం కంటే మనసుకు నచ్చిన పని చేయడమే తనకు బాగుందని, జీవితం సంతృప్తిగా ఉందని చెబుతున్నారు వాలెరీ. మరి మీరేమంటారు? జీతమా.. జీవితమా..?

News June 15, 2024

కర్ణాటకలో పెట్రోల్ ధరలు పెంపు

image

కర్ణాటక ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కి చేరగా డీజిల్ రేట్ రూ.88.94గా ఉంది. కాగా రాష్ట్రంలో 2021 నవంబర్‌లో చివరిసారి ఇంధన ధరలను సవరించారు.

News June 15, 2024

BREAKING: పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

image

AP: CM హోదాలో తొలిసారి మంగళగిరి TDP ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏంటి? కార్యకర్తలను కలిసేటప్పుడు ఇవి పెట్టవద్దు. నాకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం. నిర్దిష్ట సమయంలో ఇవి పరిష్కారం అయ్యేలా చూస్తాం. ప్రజా వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తా’ అని ఆయన వెల్లడించారు.

News June 15, 2024

యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశం పుతిన్‌కు లేదు: ఉక్రెయిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ తెచ్చిన సంధి ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది. అసలు ఆయనకు యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశమే లేదని మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో కుట్రకు తెరతీశారని దుయ్యబట్టింది. ఆయన డిమాండ్లలో కొత్తవేమీ లేవని పేర్కొంది. కాగా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూరడదని, తాము స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని పుతిన్ డిమాండ్ చేశారు.

News June 15, 2024

సీఎం హోదాలో తొలిసారి పార్టీ ఆఫీస్‌కు CBN

image

AP: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శనివారం పార్టీ ఆఫీస్‌కు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

News June 15, 2024

‘కాలర్ ఐడీ’పై త్వరలో టెలికం కంపెనీల ట్రయల్స్

image

ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్‌లో డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీపై టెలికం కంపెనీలు ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి. ఇటీవల స్పామ్, మోసపూరిత కాల్స్ పెరగడంతో కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదించింది. తొలుత వ్యతిరేకించిన టెలికం కంపెనీలు.. GOVT, TRAI ఒత్తిడితో త్వరలో కొన్ని నగరాల్లో ట్రయల్స్ చేపట్టనున్నాయి. పరిశీలన అనంతరం ఈ సేవలు సాధ్యమా? లేదా? అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి.

News June 15, 2024

ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్

image

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదేరోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ కూడా విడుదలవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, షూటింగ్ పూర్తవకపోవడంతో విడుదల వాయిదా పడినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.