News June 14, 2024

వెల్‌కమ్ చీఫ్: మంచు మనోజ్

image

జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలుశాఖలకు మంత్రి కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ‘మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి. ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నా. వెల్‌కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశారు.

News June 14, 2024

‘డిప్యూటీ CM’ రాజ్యాంగబద్ధ పదవి కాదా?

image

రాజ్యాంగంలో డిప్యూటీ CM పదవి ప్రస్తావన లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముందే డిప్యూటీ CM పదవి ఖరారైనా ‘మంత్రి’గానే ప్రమాణస్వీకారం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా మంత్రికంటే పైస్థాయి, CM తర్వాతి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా డిప్యూటీ CM పదవిస్తారు. దీనికి పాలనలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ రాజ్యాంగ పరంగా ప్రత్యేక హక్కులు, అధికారాలు, బాధ్యతలుండవు. డిప్యూటీ PM కూ ఇంతే.

News June 14, 2024

కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత

image

కరోనా సమయంలో తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని EPFO నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఆ సదుపాయాన్ని నిలిపివేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సదుపాయంతో 3 నెలల బేసిక్+DA లేదా ఖాతాలో ఉన్న 75% వరకు నగదు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజా నిర్ణయంతో ఆ వెసులుబాటు ఉండదు. PF డ్రా చేసుకోవాలంటే అందులో పేర్కొన్న ఇతర కారణాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

News June 14, 2024

చంద్రబాబు కీలక నిర్ణయం.. సోమవారం పోలవరం టూర్

image

AP: వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అధికారులతో సమీక్షలో వాటి స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలోనూ సీఎంగా ఉన్నప్పుడు సోమవారం-పోలవరం అని ఈ ప్రాజెక్టుపై CBN సమీక్షలు చేసేవారు.

News June 14, 2024

ఇకపై కార్లు మరింత కాస్ట్లీ?

image

వాహనాల కర్బన ఉద్గారాల‌పై కేంద్రం తెచ్చిన CAFE-3, CAFE-4 మార్గదర్శకాలు కార్ల ధరలపై ప్రభావం చూపొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 APRలో BS-6 నార్మ్స్ అమలులోకి వచ్చాక ధరలు 30% పెరిగాయని, ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నాయి. ఐదేళ్లలో తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే బడ్జెట్ కార్లను రూపొందించడం సవాల్‌తో కూడుకుందని తెలిపాయి. కర్బన ఉద్గారాల ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.

News June 14, 2024

యుద్ధం ఆపేస్తాం.. కానీ రెండు షరతులు: పుతిన్

image

నాటోలో సభ్య దేశంగా చేరాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే ఉక్రెయిన్‌‌లో కాల్పులు విరమణ చేపడతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అలా అయితే వెంటనే చర్చలు ప్రారంభిస్తామంటూ ఆ దేశానికి ఆఫర్ ఇచ్చారు. అలాగే తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కారణాలతో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం రెండేళ్లుగా ముగింపు లేకుండా కొనసాగుతోంది.

News June 14, 2024

రూ.19వేల కోట్ల వాటాలు విక్రయించనున్న వొడాఫోన్

image

మొబైల్ ఫోన్ టవర్ ఆపరేటర్ సంస్థ ఇండస్‌లో వొడాఫోన్‌కు 21.5శాతం వాటా ఉంది. సుమారు రూ.19 వేల కోట్ల విలువైన ఆ వాటాను విక్రయించేందుకు సంస్థ యోచిస్తోంది. స్టాక్ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా వచ్చేవారం ఈ విక్రయం జరగొచ్చని వొడాఫోన్ వర్గాలు తెలిపాయి. అప్పును తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ వార్తలు రాగానే వొడాఫోన్ ఐడియా షేర్ విలువ 4.8శాతం, ఇండస్ టవర్స్ వాటా 0.3శాతం పెరగడం విశేషం.

News June 14, 2024

చంద్రబాబును కలిసిన టీడీపీ సీనియర్లు

image

AP: మంత్రి పదవి ఆశించి నిరాశకు గురైన పలువురు TDP సీనియర్లు CM చంద్రబాబును సచివాలయంలో కలిశారు. కేబినెట్ కూర్పు, భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించిన CBN, కేబినెట్‌లో ఎందుకు చోటు కల్పించలేకపోయామనే అంశాన్ని వారికి తెలియజేశారు. మంత్రి పదవి రాని వారిని వేరే రూపంలో వినియోగించుకుంటామని బాబు హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు సహా పలువురు ఉన్నారు.

News June 14, 2024

మూడోసారి తండ్రైన జోస్‌ బట్లర్‌

image

ఇంగ్లండ్ కెప్టెన్ జోస్‌ బట్లర్‌ మూడోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి లూయిస్ బట్లర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బట్లర్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. బట్లర్ దంపతులు తమ బిడ్డకు చార్లీ అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో బట్లర్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా వీరికి ఇప్పటికే జార్జియా రోజ్, మార్గోట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News June 14, 2024

ఒక్కరోజే రూ.8వేలకోట్ల భారతీయ బాండ్స్ కొనుగోలు!

image

భారతీయ బాండ్లను ఫారిన్ బ్యాంక్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గురువారం ఒక్కరోజే రూ.8వేల కోట్ల విలువైన బాండ్స్ కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి 1 తర్వాత ఈ స్థాయి కొనుగోళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి. జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్ డెట్ జాబితాలో భారత్‌కు చోటుదక్కడం, ఫెడ్ వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం ఈ కొనుగోళ్లకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.