News June 13, 2024

అమెరికాకు సౌదీ షాక్.. పెట్రో డాలర్ డీల్ రద్దు!

image

అమెరికాతో పెట్రో డాలర్ డీల్‌ను రద్దు చేస్తూ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 9న ఈ డీల్ గడువు ముగియగా దానిని పొడిగించేందుకు సౌదీ అంగీకరించలేదు. ఈ నిర్ణయంతో US డాలర్ ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రపంచ దేశాలకు సౌదీ నుంచి కొనే చమురుకు రూపాయి, యూరో, యెన్ తదితర కరెన్సీల్లోనూ చెల్లించే సదుపాయం కలగనుంది. 1974 జూన్ 8న US-సౌదీ మధ్య ఈ పెట్రో డాలర్ డీల్ జరిగింది.

News June 13, 2024

‘కల్కి’ ట్రైలర్‌లో నా ఆర్ట్‌ను వాడుకున్నారు: సంగ్‌చోయ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్‌లో ఇంట్రో సీన్‌ని కాపీ చేశారని హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్‌చోయ్ ఆరోపించారు. కల్కి బృందం తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించిందని ఆయన ఇన్‌స్టా వేదికగా మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం తాను క్రియేట్ చేసిన ఆర్ట్‌తో ట్రైలర్‌లోని VFX షాట్‌ను ఆయన కంపేర్ చేస్తూ పోస్ట్ చేశారు. దీనిపై ‘కల్కి’ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News June 13, 2024

చంద్రబాబుకి ఘన స్వాగతం పలకనున్న ఉద్యోగులు

image

AP: సచివాలయానికి వస్తున్న సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మందడం నుంచి సచివాలయం వరకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సచివాలయం రెండో బ్లాక్ నుంచి రెడ్ కార్పెట్ వేసి ఆయనను ఆహ్వానించనున్నారు. అంతకుముందు తిరుమల, ఇంద్రకీలాద్రిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. మరికాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు.

News June 13, 2024

ATM వినియోగదారులకు షాక్?

image

ఇతర బ్యాంకు ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లకు విధించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ATM ఆపరేటర్లు RBIని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.21గా ఉన్న ఛార్జీని రూ.23కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. చివరగా 2021లో కేంద్రం ఛార్జీలను పెంచింది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో నెలకు మూడు విత్‌డ్రాలు, మిగతా చోట్ల ఐదు విత్‌డ్రాలకు బ్యాంకులు ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి.

News June 13, 2024

మగవారికి సపోర్ట్‌గా రష్మిక మందన్న ట్వీట్

image

మగవారిని కించపరుస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు హీరోయిన్ రష్మిక మందన్న కౌంటర్ ఇచ్చారు. ‘మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదని గుర్తుంచుకోండి’ అని యానిమల్ సినిమాలోని సీన్‌ను ఓ నెటిజన్ షేర్ చేశారు. దీనికి రష్మిక స్పందిస్తూ.. ‘మూర్ఖుడిని నమ్మడం భయానకం. మగాళ్లలో చాలామంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం’ అని తెలిపారు.

News June 13, 2024

రికార్డు సృష్టించిన వెస్టిండీస్

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

News June 13, 2024

TDP-JSP-BJP హనీమూన్‌ నడుస్తోంది: జగన్

image

AP: ప్రస్తుతం రాష్ట్రంలో NDA కూటమి హనీమూన్ నడుస్తోందని MLCలతో భేటీలో మాజీ CM జగన్ అన్నారు. హామీల అమలుకు కొద్దిరోజులు సమయం ఇద్దామన్నారు. ‘ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దు. ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలి. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయి. EVMల గోల్‌మాల్‌‌పై చర్చ జరగాలి. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలి’ అని ఆయన సూచించారు.

News June 13, 2024

ట్రైన్‌లో ముస్లిం మహిళ ప్రసవం.. బిడ్డకు మహాలక్ష్మి పేరు

image

కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఫాతిమా ఖాతున్ అనే గర్భిణి ఆడపిల్లకు జన్మనిచ్చింది. లోనావాలా స్టేషన్‌ దాటిన తర్వాత ప్రసవం జరిగింది. రైల్వే పోలీసులు సహాయం అందించడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. లక్ష్మీదేవి పుట్టిందని కొల్హాపూర్‌ ఆలయానికి వెళ్లివస్తోన్న కొందరు చెప్పడంతో తన బిడ్డకు మహాలక్ష్మీ అనే పేరు పెట్టినట్లు తండ్రి తయ్యబ్ తెలిపారు.

News June 13, 2024

‘బుజ్జి’పై ఆనంద్ ప్రశంసలు

image

‘కల్కి’ సినిమాలోని బుజ్జి (సూపర్ కార్) గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘ముంబైని ఆక్రమించడమే అతని లక్ష్యం. కానీ, వర్లీలోని మహీంద్రా టవర్స్‌కు చేరుకున్న బుజ్జి తన కజిన్ ‘‘స్కార్పియో-ఎన్’’ను కలిశాక శాంతించాడు. అత్యద్భుతమైన భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న నాగ్ అశ్విన్‌కు అభినందనలు. ఇంత పెద్ద కలలు కనే ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’ అని ఆనంద్ తెలిపారు.

News June 13, 2024

కేజీ టమాటా రూ.90

image

టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది. రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.120కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేట్ రూ.50-60 పలుకుతోంది. టమాటా, ఉల్లి రేట్లతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.