India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీతో మెగా బ్రదర్స్ గ్రూప్ ఫొటో దిగారు. నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ ఆ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోకు పోజులిచ్చారు. ఈ చిత్రం తాజాగా బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదికపైనా చిరంజీవి, పవన్‌ను మోదీ ఆత్మీయంగా హత్తుకున్న విషయం తెలిసిందే.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ CM యడియూరప్పను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. అది CID నిర్ణయిస్తుందన్నారు. ఓ చీటింగ్ కేసులో సహాయం కోసం యడియూరప్ప వద్దకు వెళ్లగా తన కూతురి(17)ని లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. విచారణకు హాజరుకావాలంటూ CID నిన్న మాజీ CMకు నోటీసులు పంపింది. అయితే తాను ఈనెల 17న వస్తానని ఆయన రిప్లై ఇచ్చారు.
తన ఇంటి ముందు కాల్పుల ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో సల్మాన్ ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆరోజు ఉదయం తుపాకీ చప్పుడుతో తాను నిద్ర లేచినట్లు ఆయన చెప్పారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ స్టేట్‌మెంట్‌నూ తీసుకున్నారు. కాగా APR 14న సల్మాన్ ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ <<13052619>>కాల్పులు<<>> జరిపింది. ఈకేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పోలీస్ కస్టడీలోనే ఉరేసుకొని చనిపోయాడు.
వివిధ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అదానీ గ్రూప్ దృష్టి ఇప్పుడు సిమెంట్ రంగంపై పడింది. $3 బిలియన్లతో (రూ.25వేల కోట్లపైనే) పలు కంపెనీలను కొనాలని ప్లాన్ చేస్తోందట. ఈ జాబితాలో HYDకు చెందిన పెన్నా సిమెంట్ సహా సౌరాష్ట్ర సిమెంట్, వాద్‌రాజ్ సిమెంట్ తదితర సంస్థలు ఉన్నాయి. 3-4ఏళ్లలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ను దాటి అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా నిలవాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.
టీ20 WCలో పలు టాప్ టీమ్స్ పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి చేరాయి. ఆ టీమ్స్ సూపర్-8కు వెళ్లాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, అమెరికా వంటి చిన్న జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. దీంతో ఈసారి ప్రపంచ కప్ పోటీలు రసవత్తరంగా మారాయి.
మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్ పోలీస్ స్టేషన్‌లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు తెలుస్తోంది. ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి’ అంటూ పోలీసులను ఆయన వేడుకున్నట్లు సమాచారం. కానీ పోలీసులు సిగరెట్ ఇవ్వలేదట. సెలబ్రిటీ కావడంతో కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదని, దొన్నె బిర్యానీ తెప్పించినా హీరో తినలేదని సమాచారం. ఓ అభిమాని హత్యకేసులో దర్శన్‌ను బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పీఎస్‌లో విచారిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా వరుసగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. చౌనా మీన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ కేటీ పర్నాయక్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 60 సీట్లలో 46 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
TG: ముందుమాట మార్చకుండా పాఠ్య పుస్తకాలను ముద్రించడం వివాదాస్పదమవడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1-10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో పుస్తకాలను ముద్రించడంపై <<13430349>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. హీరోయిన్ దిశా పటానీ బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె ‘రాక్సీ’ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.