News June 10, 2024

నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని తల్లిదండ్రులు

image

బాలీవుడ్ నటి నూర్ మాలాబికా దాస్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. వారిది అస్సాం కాగా ఇటీవల నూర్‌ను చూసేందుకు ముంబై వచ్చి తిరిగి వెళ్లారట. వృద్ధాప్య దశలో ఉన్న తాము మృతదేహం కోసం మళ్లీ రాలేమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నూర్ స్నేహితుడు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంత్యక్రియలు జరిపించారు.

News June 10, 2024

ALERT: వర్షంలో వాహనాలు నడుపుతున్నారా?

image

వర్షాకాలం ప్రారంభమవడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ డీజీపీ X వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.
– వాహనాల టైర్ల గ్రిప్/ థ్రెడ్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి
– వాహన టైర్లలోని గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి
– వర్షం పడే సమయంలో పరిమిత వేగంతో వెళ్లడం మంచిది
– బ్రేక్ ప్యాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ చెక్ చేయించండి.
– వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్ ఉంచుకోండి

News June 10, 2024

స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?(2/2)

image

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీలు సభాపతి స్థానాన్ని ఆశిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా స్పీకర్ సభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. గతంలో స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి పారదర్శకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదు. అయితే మిత్రపక్షాలకు సభాపతి పదవిని BJP కట్టబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

News June 10, 2024

స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?(1/2)

image

NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. CBN, నితీశ్ ఇద్దరూ ఈ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఏదైనా తిరుగుబాటు తలెత్తితే స్పీకర్ పదవి కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యులపై వేటు వేసే శక్తివంతమైన హక్కు ఆ పదవికి ఉంటుంది.

News June 10, 2024

రాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం

image

రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి ₹25,066.88 కోట్లు, బిహార్‌కు ₹14056.12 కోట్లు, మధ్యప్రదేశ్‌కు ₹10,970.44కోట్లు, ప.బెంగాల్‌కు ₹10,513.46 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఏపీకి ₹5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

News June 10, 2024

డీజీపీ కార్యాలయానికి చేరిన సిట్ నివేదిక

image

AP ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై 264 పేజీలతో కూడిన పూర్తి నివేదికను డీజీపీకి సిట్ సమర్పించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం వంటి అంశాల్లో పల్నాడు జిల్లా పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని అభిప్రాయపడింది.

News June 10, 2024

చిక్కుల్లో అమేథీ MP?

image

కాంగ్రెస్ MP కిషోరీలాల్ శర్మ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆయన అఫిడవిట్ పేరుతో ఓ ఫొటో వైరలవుతోంది. అందులో 18వ లోక్‌సభ‌కు బదులుగా 17వ లోక్‌సభ ఎన్నికలకు దరఖాస్తు చేస్తున్నట్లు ఉంది. సాధారణంగా అఫిడవిట్లో తప్పులుంటే అధికారులు తిరస్కరిస్తారు. మరి శర్మ అఫిడవిట్ ఎలా స్వీకరించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమేథీలో BJP అభ్యర్థి స్మృతీ ఇరానీపై KL శర్మ సంచలన విజయం సాధించారు.

News June 10, 2024

వైసీపీ ప్రభుత్వ బాధితులను ఆహ్వానించిన కొత్త ప్రభుత్వం

image

AP: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి గత వైసీపీ సర్కారు బాధితులను కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. ఆహ్వానం అందిన వారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి. కాగా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News June 10, 2024

వరంగల్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి: కిషన్ రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ ఇవ్వడం తెలుగు రాష్ట్రాలకు శుభపరిణామమని చెప్పారు. ఆయన సహాయంతో రెండు రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టులను సమర్థవంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News June 10, 2024

విజయవాడలో ఓడితే రాజకీయ సన్యాసమేనా!

image

విజయవాడ MP సీటులో ఓడిపోయిన నేతలు రాజకీయాలకు దూరమైపోతున్నారు. 2014లో కోనేరు రాజేంద్రప్రసాద్, 2019లో ప్రసాద్ వి పొట్లూరి ఓడిపోగా పొలిటికల్ కెరీర్‌కు ముగింపు పలికారు. తాజాగా ఓడిపోయిన కేశినేని నానీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురూ YCP అభ్యర్థులే కావడం గమనార్హం. గతంలో ఇక్కడ 2 సార్లు గెలిచిన లగడపాటి రాష్ట్ర విభజన తర్వాత (2014) పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు.