News June 4, 2024

గోదావరి జిల్లాలో సత్తా చాటే వారిదే అధికారం!

image

AP: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 34 స్థానాలున్న ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ప.గో(D)లో 15 స్థానాలకు గాను YCP 13, TDP 2 స్థానాల్లో నెగ్గింది. తూ.గో(D)లో 19 సీట్లలో YCP 15, TDP 4 స్థానాల్లో గెలిచాయి. 5 MP స్థానాలనూ YCPనే సొంతం చేసుకుంది. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

News June 4, 2024

కంటోన్మెంట్: పాగా వేయాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని BRS!

image

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికీ పోలింగ్ జరిగింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఈ స్థానంలో గెలిచి కంటోన్మెంట్‌లోనూ పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోవద్దని BRS చూస్తోంది. BJP సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ నివేదిత(BRS), శ్రీగణేశ్(కాంగ్రెస్), వంశ తిలక్(BJP) పోటీలో ఉన్నారు.

News June 4, 2024

రాయలసీమలో ‘మెజార్టీ’ రికార్డులు బ్రేకయ్యేనా?

image

AP: 2019లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(90,110)తో సీఎం జగన్ పులివెందుల(కడప)లో విజయం సాధించారు. రాయలసీమ జిల్లాలవారీగా చూసుకుంటే గుంతకల్లు(అనంతపురం)లో వెంకట్రామిరెడ్డి 48,532 ఓట్లు, తంబళ్లపల్లి(చిత్తూరు)లో ద్వారకానాథ్ 46,938 ఓట్లు, పత్తికొండ(కర్నూలు)లో కంగాటి శ్రీదేవి 42,065 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈసారి ఈ రికార్డులు ఎవరు బ్రేక్ చేసే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News June 4, 2024

BREAKING: టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

image

AP: ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్ టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యారు. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తికి ఏజెంట్‌గా అధికారులు అవకాశం కల్పించారు.

News June 4, 2024

ఈటలకు ఈజీనేనా?

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజిగిరిలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. బలమైన నేత ఈటల రాజేందర్‌ను బరిలో దింపడం, ప్రధాని మోదీ అక్కడ రోడ్‌షో నిర్వహించడంతో గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? సునీతా మహేందర్‌రెడ్డికి జనం జై కొడతారా?లేక బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డివైపు జనం చూస్తారా? అనేది ఉత్కంఠ నెలకొంది.

News June 4, 2024

వీరు ఓడినా.. గెలిచినా పదవిలోనే!

image

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానంలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్, BRS నుంచి లోకల్ MLA పద్మారావుగౌడ్ నువ్వానేనా అంటున్నారు. అయితే.. MP పదవిని వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ వీరు ఓడినా MLAలుగా కొనసాగనున్నారు. గెలిస్తే MP అవుతారు. ఇక్కడ సిట్టింగ్ MP కిషన్‌రెడ్డి(BJP)ని వీరు ఢీకొంటున్నారు.

News June 4, 2024

ELECTIONS: మర్యాద ముఖ్యం బిగులు!

image

కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు, అభ్యర్థులు మర్యాదగా వ్యవహరించాలని ఈసీ కోరింది. కౌంటింగ్ పరంగా ఏవైనా సందేహాలుంటే వాటిని నిర్దేశిత పద్ధతిలో తెలియజేయాలని పేర్కొంది. అలా కాకుండా అల్లర్లు చేసేందుకు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 53(4) సెక్షన్ కింద వారిని కౌంటింగ్ కేంద్రం నుంచి బహిష్కరించడంతో పాటు కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

News June 4, 2024

రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు?

image

AP: రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల ప్రజలు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది. 2019లో 52 అసెంబ్లీ స్థానాలకు(కడప-10, కర్నూలు-14, చిత్తూరు-14, అనంతపురం-14)గాను ఏకంగా 49 చోట్ల YCP విజయం సాధించింది. 8 MP స్థానాలనూ సొంతం చేసుకుంది. హిందూపురం(బాలకృష్ణ), ఉరవకొండ(పయ్యావుల కేశవ్), కుప్పం(చంద్రబాబు) మాత్రమే TDP నుంచి గెలిచారు. ఈసారి మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ఇరుపార్టీలూ ధీమాగా ఉన్నాయి.

News June 4, 2024

సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతున్నారా? జాగ్రత్త!

image

AP: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రత్యర్థులను బెదిరిస్తూ ఫొటోలు, వీడియోలతో పోస్టులు పెట్టినా, షేర్లు చేసినా <<13368661>>కఠిన చర్యలు<<>> తప్పవని DGP ఇప్పటికే హెచ్చరించారు. కాబట్టి ఏ పార్టీ మద్దతుదారులైనా సంయమనం పాటించండి. పంతాలు, ఇగోలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు.#BE CAREFUL

News June 4, 2024

ఉత్తరాంధ్రలో ఆధిక్యం ఎవరిదో?

image

AP: ఉత్తరాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో YCP 34 స్థానాలకు గాను 28 స్థానాల్లో గెలిచింది. TDP కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. VSPలో 4, SKLMలో 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. VZMలో ఒకస్థానంలో కూడా గెలవలేదు. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొనడంతో ప్రజలు ఏ పార్టీకి పట్టంగట్టారోనన్న ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది.