India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు వెల్లడికానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు NDAదే విజయమని, ఆ కూటమికి 350కిపైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తాము గెలుపొందుతామని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంచనాలకు తగినట్టు బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? లేక ఫలితాల్లో ట్విస్ట్ ఉంటుందా? అనేది చర్చనీయాంశమైంది.
ఇకపై టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రసారభారతి ప్రకటించింది. జులై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌నూ ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28-సెప్టెంబరు 8 మధ్య జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కూడా లైవ్ చూడొచ్చని పేర్కొంది. మరోవైపు ఫ్రెంచ్ ఓపన్, వింబుల్డన్ ఫైనల్స్ కూడా టెలికాస్ట్ చేస్తామని వెల్లడించింది.
* 1897: స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకంటి రాఘవయ్య జననం
* 1946: గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం జననం
* 1961: సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి జననం
* 1968: నటుడు తొట్టెంపూడి వేణు జననం
* 1984: సినీ నటి ప్రియమణి జననం
* 1998: సాహితీవేత్త ఆరుద్ర మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి ఫలితం నేడు మ.ఒంటి గంట కల్లా నిజామాబాద్ సీటులో వెలువడనుంది. ఇక్కడ కేవలం 15రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మరోవైపు కరీంనగర్, నల్గొండ, HYD నియోజకవర్గాల ఫలితాలు చివర్లో(24 రౌండ్లు) వచ్చే అవకాశముంది. ఇక చేవెళ్లలో 23, మల్కాజిగిరిలో 21, SEC 20, ADB 23, PDPL 21, ZHB 23, MDK 23, WGL 18, BNR 23, MHBD 22, KHM 21, MHBR 21, NGKL 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సఫారీల ధాటికి 77 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ మెండిస్ 19(30), కమిందు మెండిస్ 11(15), మాథ్యూస్ 16(16) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. దీంతో ప్రోటీస్ జట్టు 16.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. సఫారీ బౌలర్ నార్ట్‌జే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
తేది: జూన్ 4, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:50 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు
ఇష: రాత్రి 8.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 4, మంగళవారం
బ.త్రయోదశి: రాత్రి 10.01 గంటలకు
భరణి: రాత్రి 10:34 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.08:12 నుంచి 09:04 వరకు తిరిగి రాత్రి గం.10.59 నుంచి 11.43 వరకు
వర్జ్యం: ఉదయం గం.09:05 నుంచి 10:35 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* రేపే ఎన్నికల కౌంటింగ్.. సర్వత్రా ఉత్కంఠ
* నటి హేమ అరెస్ట్.. 14 రోజుల కస్టడీ
* ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఈనెల 7 వరకు పొడిగింపు
* తెలంగాణను తాకిన రుతుపవనాలు
* కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు: CBN
* వైసీపీ శ్రేణులు రేపు అప్రమత్తంగా వ్యవహరించాలి: జగన్
* YCPకి 123 స్థానాలు వస్తాయి: పరిపూర్ణానంద
* రూ.8 లక్షల కోట్లు దాటిన ఎస్బీఐ మార్కెట్ విలువ
* T20 WC-2024 విజేతకు ప్రైజ్‌మనీ ₹20.36కోట్లు
Sorry, no posts matched your criteria.