India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియని యాక్సిస్ మై ఇండియా సంస్థ కూటమి గెలుపుపై జోస్యం చెప్పిందని YCP విమర్శించింది. ‘రాజస్థాన్, WB, CH ఎన్నికల్లో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు పూర్తిగా తప్పాయి. బుర్రలేని TDP, ఎల్లో మీడియా ఆ సర్వేపై ఆహా అంటూ కీర్తనలు. ఫేక్ సర్వేలను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్న కూటమి’ అని ఎద్దేవా చేసింది. APలో 177 స్థానాలంటూ ఇండియా టుడే ఛానల్‌లో చూపినట్లు ఓ ఫొటోను YCP పంచుకుంది.
కోలీవుడ్ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ చిక్కుల్లో పడ్డారు. తన బ్యాగులో 40 బుల్లెట్లను తీసుకెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయారు. అధికారులు బుల్లెట్లను స్వాధీనం చేసుకుని ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. ఇండిగో విమానంలో చెన్నై నుంచి తిరుచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై EC స్పందించింది. ఆరోపణలపై తగిన ఆధారాలివ్వాలని ఆదేశించింది. ‘మీరు ఒక జాతీయ పార్టీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం’ అని ఈసీ ఆయనకు రాసిన లేఖలో పేర్కొంది.
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్(ECI) ఓ ప్రకటనలో తెలియజేసింది. ఏప్రిల్ 19న విడతల వారీగా మొదలైన పోలింగ్ నిన్నటితో ముగిసింది. కాగా పోలింగ్ ప్రక్రియ ముగిశాక ECI మీడియా సమావేశం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతలు పగటి కలలు కనడం మానుకోవాలని BJP సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. ఇండియా కూటమి 295 స్థానాల్లో గెలుస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పేదల అభ్యునతి కోసం పాటు పడే మోదీని విమర్శించడం మాని క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని సూచించారు. అప్పుడైనా ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే అవకాశముందని చెప్పారు. NDA 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CDSE)కు దరఖాస్తుల స్వీకరణ ఎల్లుండితో ముగియనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో మొత్తం 459 ఖాళీలున్నాయి. CDSEలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు, మహిళలు జూన్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలను బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. వెబ్‌సైట్: upsc.gov.in
భారత్‌తో మ్యాచ్ అంటే తమకూ కాస్త టెన్షనే అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు. ‘భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లుగా మాకెంతో ఉత్సాహం ఉంటుంది. అదే సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే కూల్‌గా ఆడితే విజయం వరిస్తుందని నమ్ముతా. అందుకు తగ్గట్లుగా సాధన చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. కాగా T20 WCలో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఉత్కంఠ మధ్య నిన్న విడుదలైన India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం విషయంలో నిజమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ సంస్థ అంచనాలకు తగ్గట్టే ఇవాళ తుది రిజల్ట్ వచ్చింది. అరుణాచల్‌లో బీజేపీకి 44-51 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని India Today తెలపగా ఫలితాల్లో 46 సీట్లు వచ్చాయి. సిక్కింలో SKM పార్టీకి 24-30 వస్తాయని ప్రిడిక్ట్ చేయగా రిజల్ట్‌లో ఆ పార్టీ 31 సీట్లను కైవసం చేసుకుంది.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష SDF పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ CM పవన్ కుమార్ చామ్లింగ్ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓడారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఆయన MLAగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం సీఎంగా పవన్ కుమార్ పనిచేశారు.
ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు వాగ్వాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతణ్ని రాడ్‌తో తలపై కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 1993 MAR 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించారు. ఈ కేసులో దోషి మున్నా కొల్హాపూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.