India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ రాజపాలయం: తమిళనాడులో కనిపించే వీటిని ఇండియన్ సైట్ హౌండ్ డాగ్స్ అని కూడా అంటారు. ఇవి తెలివైనవని చెబుతుంటారు.
☛ ముధోల్ హౌండ్: కర్ణాటకకు చెందిన ఈ జాతి కుక్కలకు వేగం ఎక్కువ. వీటిని ఆర్మీ ఉపయోగిస్తుంటుంది.
☛ చిప్పిపరై: ఇవి TNకు చెందినవి. పూర్వం రాజ కుటుంబాలు పెంచుకునేవి. చాలా విశ్వాసంగా ఉంటాయి.
☛ ఇండియన్ పారియా: ఇవి దేశమంతటా కనిపిస్తాయి.
☛ బఖర్వాల్: J&Kలో ఉండే ఈ శునకాలు భయమెరుగనివి అని అంటారు.

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక ఎంపీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి భవన సముదాయాల్లో కలియతిరిగారు. కొండ పైనుంచి బీచ్ అందాలను చూస్తూ ఫొటోలు తీసుకున్నారు. ప్యాలెస్ వద్ద పనిచేస్తోన్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన ట్విటర్‌లో షేర్ చేసింది.

మొబైల్ నంబర్ వెరిఫికేషన్ / డిస్ కనెక్షన్ కోసం యూజర్లకు కాల్స్/మెసేజ్‌లు విపరీతంగా వస్తున్నాయి. తాజాగా దీనిపై TRAI స్పందించింది. ఇలాంటి మెసేజ్‌లు తాము పంపించమని స్పష్టం చేసింది. అలాంటి మోసపూరితమైన కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని కోరింది. అలాంటి వాటిని https://sancharsaathi.gov.inకు తెలపాలంది. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 / cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించింది.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఈ నెల 25న తీవ్రతుఫానుగా ఒడిశా, బెంగాల్ తీరాల సమీపంలో తీరం దాటుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఓ మార్కెటింగ్ కంపెనీ(UK) CEO లారెన్ టిక్నర్ తమ ఉద్యోగి పెళ్లి కోసం 2 రోజుల లీవ్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియాలో వెల్లడించారు. అతనికి ఇంతకు ముందే రెండున్నర వారాలు సెలవు ఇచ్చానని, అయితే రీప్లేస్‌మెంటయ్యే ఉద్యోగికి ట్రైనింగ్ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ‘సెలవు తీసుకుంటే మరో ఉద్యోగికి శిక్షణ ఇవ్వాలా? ఇదెక్కడి రూల్? ఇలాంటి విధానాన్ని ఉపేక్షించకూడదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

AP: నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. అయితే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ సభకు రావట్లేదన్నారు. అయితే ఈ సమావేశాలకు ఆయన వస్తారని వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవిష్ణు, హసిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘స్వాగ్’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 5 పాత్రల్లో శ్రీవిష్ణు కనిపించగా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా వచ్చే నెల 4న ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తల్లి మరణించిన బాధలో ఏడుస్తుండగా హీరో సుదీప్‌ను ఫొటోలు తీయడాన్ని ఆయన కూతురు శాన్వీ తప్పుబట్టారు. బాధలో ఉన్న వ్యక్తిపై ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారని తనకు తెలియదన్నారు. కొందరు తన మొహంపైన కెమెరాలు పెట్టారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడంలో లేదని రాసుకొచ్చారు.

TG: తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మ.2 గంటల నుంచి సా.5 వరకు పరీక్ష జరిగింది. జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఎగ్జామ్స్ నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. ఈ నెల 27న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.

రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ప్లేయర్ పుజారా అదరగొట్టారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచులో డబుల్ సెంచరీ చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 డబుల్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఉన్నారు. గత కొంత కాలంగా ఫామ్ లేమి కారణంతో ఆయన టీమ్ ఇండియాకు దూరమయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆయన సత్తా చాటడం గమనార్హం. మరి పుజారాను మళ్లీ టీమ్‌లోకి తీసుకుంటారా?
Sorry, no posts matched your criteria.