News November 8, 2024

స్పిరిట్, యానిమల్ పార్క్‌పై నిర్మాత కీలక వ్యాఖ్యలు

image

ప్రభాస్-సందీప్‌రెడ్డి కాంబోలో ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాతే రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ ఉంటుందని Tసిరీస్ ఎండీ భూషణ్ కుమార్ వెల్లడించారు. స్పిరిట్‌ను 2026లో, యానిమల్-2ను 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది రైడ్-2, దే దే ప్యార్ దే-2(అజయ్ దేవగణ్)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఢమాల్-3, బోర్డర్-2 సినిమాలను 2026లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News November 8, 2024

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

image

TG: ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభితల పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ స్పందించింది. గతంలోనూ నోటీసులు ఇవ్వగా, కోర్టును ఆశ్రయించిన వేణుస్వామి విచారణ నుంచి తప్పించుకున్నారు. తాజాగా స్టే ఎత్తివేయడంతో మళ్లీ ఆయనకు నోటీసులు పంపింది.

News November 8, 2024

తన స్నేహితుడిలా మరెవరికీ జరగొద్దని..!

image

దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్‌గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్‌ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.

News November 8, 2024

ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

image

AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2024

నోట్ల రద్దుకు 8 ఏళ్లు

image

కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.

News November 8, 2024

Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5

News November 8, 2024

తిరుమలను UTగా చేయాలన్న కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్

image

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో రాజకీయం నడుస్తోందని, దేశ ప్రతిష్ఠను కాపాడటానికి పిల్ వేశానని పాల్ పేర్కొన్నారు. దీనిప్రకారం అన్ని ఆలయాలు, గురుద్వారాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆదేశించామని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

News November 8, 2024

మంచి జీవితం కోసం కొన్ని గుడ్ హ్యాబిట్స్

image

పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా తరచూ జీవిత సూత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్నింటిని అలవాటు చేసుకోవాలని తాజాగా సూచించారు. > నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని 80/20 పద్ధతిలో తినండి. రోజూ వ్యాయామం చేయండి. పుస్తకాలు చదవండి. కృతజ్ఞతగా ఉండటాన్ని పాటించండి. మీ రోజును ప్లాన్ చేసుకోండి. లక్ష్యాలను సెట్ చేయండి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి.

News November 8, 2024

తిరుమలలో అన్యమతస్థులపై వేటు?

image

AP: తిరుమలలో అన్యమతస్థుల అంశం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. గతంలో అన్యమత ఉద్యోగులను గుర్తించి జాబితా రెడీ చేశారు. అయితే వారిని తిరుమల నుంచి తప్పించే చర్యలు మాత్రం ముందుకు సాగలేదు. ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్యమతస్థుల స్వచ్ఛంద బదిలీలకు అవకాశం కల్పించి పంపించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

News November 8, 2024

లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమ వాళ్లు కనిపించడం లేదని పిటిషనర్ల తరఫు లాయర్లు న్యాయమూర్తికి వివరించగా, మధ్యాహ్నం 2.30కు విచారిస్తామని జడ్జి తెలిపారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఏజీ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.