India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శాకాహార భోజనం ప్లేటుకు అయ్యే ఖర్చు 7% పెరిగి రూ.27.3కు చేరిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో రూ.25.5గా ఉందని పేర్కొంది. నిత్యావసర సరకుల ధరలు పెరగడమే దీనికి కారణమని వెల్లడించింది. ఇక మాంసాహార భోజనం ప్లేట్ ధర 7% తగ్గి రూ.59.2 నుంచి రూ.54.9కి చేరినట్లు వివరించింది. ఉల్లిపాయలు 46%, టమాటాలు 36%, ఆలుగడ్డ 22%, పప్పులు 22%, బియ్యం ధరలు 14% పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఎమ్మెల్యేల అనర్హత అంశం చర్చనీయాంశంగా మారింది. గెలిచిన పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీల్లో చేరే వారి అసెంబ్లీ/పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది.
AP: తాను టీడీపీలో చేరబోతున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు. ఈ రోజు సాయంత్రం పాలకొల్లులో జరగనున్న ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రజలందరూ బీజేపీ-టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. RRRకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
TG: టెట్ దరఖాస్తుల గడువు ఈనెల 10తో ముగియనుంది. గత నెల 27న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 85,512 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నాటికి పేపర్-1కు 34,174, పేపర్-2కు 51,238 మంది అప్లై చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులకు మరో 5 రోజులు అవకాశం ఉండగా, మళ్లీ గడువు పొడిగించకపోవచ్చని సమాచారం.
AP: ఇటీవల జ్వరం బారినపడ్డ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరిగి ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఈనెల 7న అనకాపల్లిలో, 8న ఎలమంచిలిలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని జనసేన తెలిపింది. 9న పిఠాపురంలో నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పేర్కొంది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన వివరాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ ఎట్టకేలకు మొదలైంది. ఈనెల 2న షూటింగ్ ప్రారంభమైనట్లు నితేశ్ ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్ పాల్గొననున్నారు. అయితే, ‘రామాయణం’ మూవీకి ఏఆర్ రెహమాన్‌తో పాటు ‘ది లయన్ కింగ్’ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.
MLC కవితను విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వచ్చేవారం తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సీబీఐ అధికారులు ఆమెను విచారించనున్నారు. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
AP: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో దారుణం జరిగింది. టీ షర్ట్ కోసం తమ్ముడితో జరిగిన ఘర్షణలో అన్న ప్రాణాలు కోల్పోయాడు. అన్న రమేశ్ టీషర్ట్‌ను తమ్ముడు సురేశ్ ధరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రమేశ్‌ను సురేశ్ నెట్టేయడంతో తలకు రాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సురేశ్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా రాణిస్తున్నారని ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అన్నారు. ‘కోహ్లీ ఒక్కడే రాణిస్తే ఫలితం లేదు. మిగతా ఆటగాళ్ల నుంచి అతడికి సహకారం కావాలి. జట్టులోని ఇతర ఆటగాళ్లు విఫలమవుతుంటే అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లీపై ఆధారపడడం తగదు. ఆటగాళ్లందరూ సమష్ఠిగా రాణిస్తేనే ఆర్సీబీ టైటిల్ రేసులో ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో NIA బీజేపీ కార్యకర్తగా ఉన్న సాయిప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. తీర్థహళ్లిలోని ఓ మొబైల్ షాప్‌కు చెందిన ఇద్దరు యువకులకు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన అధికారులు ఇటీవల విచారించారు. వీరికి సాయిప్రసాద్‌తో పరిచయం ఉన్నట్లు తేలడంతో అతడిని ప్రశ్నిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.