News October 21, 2024

ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్

image

TG: తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మ.2 గంటల నుంచి సా.5 వరకు పరీక్ష జరిగింది. జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఎగ్జామ్స్ నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. ఈ నెల 27న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.

News October 21, 2024

పుజారా డబుల్ సెంచరీ

image

రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ప్లేయర్ పుజారా అదరగొట్టారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచులో డబుల్ సెంచరీ చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 డబుల్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఉన్నారు. గత కొంత కాలంగా ఫామ్ లేమి కారణంతో ఆయన టీమ్ ఇండియాకు దూరమయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆయన సత్తా చాటడం గమనార్హం. మరి పుజారాను మళ్లీ టీమ్‌లోకి తీసుకుంటారా?

News October 21, 2024

ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్-చైనా ఒప్పందం

image

తూర్పు లద్దాక్‌లో LAC వెంబ‌డి పెట్రోలింగ్ విష‌యంలో భారత్-చైనా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొన్ని వారాలుగా ఇరు దేశాల దౌత్య‌వేత్త‌లు, సైన్యాధికారులు జ‌రిపిన చ‌ర్చ‌ల్లో పురోగ‌తి సాధించిన‌ట్టు విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్రం మిస్రీ తెలిపారు. 2020లో గాల్వన్‌లో త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల ప‌రిష్కారానికి ఇది దోహ‌ద‌పడుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత బలగాలు మరిన్ని పెట్రోలింగ్ పాయింట్లను యాక్సెస్ చేయగలవు.

News October 21, 2024

జీవో 29పై న్యాయపోరాటం చేస్తాం: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 29 వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కేటీఆర్ అన్నారు. దీనిపై హైకోర్టులో తమ న్యాయవాదులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పొడవటం కంటే పెద్ద నేరం ఉండదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని నిరూపిస్తాం’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

News October 21, 2024

BIG BREAKING: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ CSకు కూడా నోటీసులిచ్చింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఓ న్యాయవాది ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యిని వాడినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.

News October 21, 2024

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధం: షమీ

image

గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న పేసర్ షమీ తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు సిగ్నల్ ఇచ్చారు. ‘నేను హాఫ్ రన్‌తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. అంతకు ముందు రంజీట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News October 21, 2024

కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: కడియం

image

TG: గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కనపెట్టారని అన్నారు. ‘2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? కేసీఆర్ నీతిమంతులైతే తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, ఆ పార్టీల నేతలు అధికారం కోసం పోటీ పడుతున్నారని అన్నారు.

News October 21, 2024

‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ న్యూ లుక్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ ‘రాజా సాబ్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఎల్లుండి టైటిల్ ట్రాక్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త లుక్‌లో ప్రభాస్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ కానుంది.

News October 21, 2024

జగన్ బీజేపీకి దత్తపుత్రుడు: షర్మిల

image

AP: మాజీ సీఎం YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత YCP ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. ‘YSR తన జీవితం మొత్తం మత పిచ్చి BJPని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు’ అని దుయ్యబట్టారు.

News October 21, 2024

Stock Market: లాభాలు నిలుపుకోలేక నష్టాల్లోకి

image

ఆరంభ లాభాల‌ను మార్కెట్లు నిలుపుకోలేకపోయాయి. ఉద‌యం 100 పాయింట్ల లాభంతో ప్రారంభ‌మైన నిఫ్టీ చివ‌రికి 72 పాయింట్లు న‌ష్టపోయి 24,781 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అటు సెన్సెక్స్‌ 81,450 ప‌రిధి దాట‌లేక 73 పాయింట్ల న‌ష్ట‌పోయి 81,151 వ‌ద్ద స్థిర‌ప‌డింది. BSeలో 9 మాత్ర‌మే గ్రీన్‌లో ముగిశాయి. Bajaj Auto, Hdfc Bank, Asian Paint, M&M టాప్ గెయినర్స్. Tata Consum, Kotak Bank, Bajaj Finsv, BPCL, IndusInDBK టాప్ లూజర్స్.