News April 5, 2024

టీడీపీలో చేరనున్న రఘురామకృష్ణరాజు

image

AP: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాసేపట్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

News April 5, 2024

‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్ చేసింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్‌లెస్‌గా చూపించారని, ‘పుష్ప-2’లో బ్యూటిఫుల్‌గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

News April 5, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త అంశం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో వారు ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పుడు మాజీ MLA, ప్రస్తుతం MLAగా ఉన్న ఓ కీలక నేత ఫోన్‌ను వారు ట్యాప్ చేశారట. దీంతో వారిని HYD తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ట్యాపింగ్ కేసుతో లింకై ఉన్న అంశాలన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 5, 2024

రెపో రేటు అంటే ఏంటి? మనకేం లాభం?

image

రెపో రేటును 6.5%గా కొనసాగిస్తున్నట్లు RBI తాజాగా ప్రకటించింది. బ్యాంకులు RBI నుంచి తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటును RBI నిర్ణయిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

News April 5, 2024

రూ.98.52 కోట్ల విలువైన అక్రమ మద్యం స్వాధీనం

image

లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సైజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మైసూరులోని చామరాజనగర్ నియోజకవర్గంలో రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. పట్టుబడిన మద్యం 1.22 కోట్ల లీటర్ల బీర్ అని పేర్కొంది. దీంతో పాటు ఐటీ SST బృందం రూ.3.53 కోట్లు స్వాధీనం చేసుకుంది.

News April 5, 2024

యాపిల్‌‌లో 600 మందిపై వేటు

image

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ సంస్థ యాపిల్ 600 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన నివేదికలో కుపర్టినో అనే సంస్థ ఈ విషయం వెల్లడించింది. యాపిల్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టులు నిలిచిపోవడమే ఈ ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. ఒక్క శాంటాక్లారాలోని యాపిల్ కారు సంబంధిత కార్యాలయం నుంచే 371 మందిని తొలగించినట్లు సమాచారం.

News April 5, 2024

GET READY: ‘శ్రీవల్లి’ వచ్చేస్తోంది

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఉదయం 11.07 గంటలకు శ్రీవల్లి రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 5, 2024

ఉమేశ్ ఖాతాలో ఆ రికార్డు

image

గుజరాత్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డును సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. పంజాబ్‌పై ఉమేశ్ 34 వికెట్లు తీయడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మోహిత్ శర్మ(MIపై 33 వికెట్లు), సునీల్ నరైన్(పంజాబ్‌పై 33 వికెట్లు), బ్రావో(MIపై 33 వికెట్లు), భువనేశ్వర్(KKRపై 32 వికెట్లు) ఉన్నారు.

News April 5, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్: RBI

image

రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 6.5శాతంగానే కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో RBI వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) RBIకి ఇదే తొలి ప్రకటన.

News April 5, 2024

వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్ ఈయనే!

image

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్ నిలిచారు. వెనిజులకు చెందిన జువాన్‌ పెరెజ్‌ మోరా(114) మరణించడంతో ఆయన స్థానాన్ని జాన్ భర్తీ చేశారు. 1912లో జన్మించిన ఈయన.. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ‘రాయల్‌ మెయిల్‌’లో అధికారిగా సేవలందించారు. తన సుదీర్ఘ జీవిత ప్రయాణానికి కారణాలేంటని అడిగిన వారికి.. ‘మంచి ఆహారంతోపాటు ప్రతి శుక్రవారం చేపల భోజనం, వ్యాయామం చేయడం’ అని చెప్పుకొచ్చారు.

error: Content is protected !!