India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది జూలైలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌ని రష్యా లక్ష్యంగా చేసుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆరోపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తితో పాటు మరేవిధంగానైనా రష్యా చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో రష్యా తప్పక ఓడిపోతుందని అన్నారు. శత్రుత్వాన్ని తాము ప్రేరేపించమని.. కానీ ఏదొక రోజు యూరోపియన్ దళాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.
TG: సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రభోదానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి
మరణం
AP: టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు. కూటమి నిర్వహణ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు.
తేది: ఏప్రిల్ 5, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55 సూర్యోదయం: ఉదయం గం.6:07
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2019లో 67.40శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లో పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
చిన్నకార్ల అమ్మకాలు భారత్‌లో మరో రెండేళ్లలో పుంజుకుంటాయని మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. బైక్‌ల నుంచి కార్లకు మారాలి అనుకునే వారు నేరుగా SVUలను కొనుగోలు చేయరని.. దీంతో చిన్నకార్లకు డిమాండ్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా నిర్వహణ వ్యయాలు, ట్యాక్సులు, కర్భన ఉద్గార నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా చిన్న కార్లు, బైక్‌ల ధరలు పెరిగాయి. దీంతో గతేడాది చిన్నకార్ల విక్రయాలు 12% మేర పడిపోయాయి.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ AP: ఇంటర్ కాలేజీలకు మే 31 వరకు సెలవులు
✒ AP: టిప్పర్ డ్రైవర్లకూ రూ.10,000: CM జగన్
✒ AP: పోలీసులు జగన్‌ను లోపల వేయాలి: CBN
✒ AP: చంద్రబాబుకు EC నోటీసులు
✒ AP: అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి: CBI
✒ TG: టెస్లాతో చర్చలు జరుపుతున్నాం: శ్రీధర్ బాబు
✒ TG: ఫోన్ ట్యాపింగ్‌లో KCR ప్రమేయం: కిషన్ రెడ్డి
✒ TG: నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టింది: KTR
✒ TG: కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు
Sorry, no posts matched your criteria.