India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న 4 రోజులు పలు చోట్ల ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు, అక్కడక్కడ 4- 5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశముందని చెప్పింది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కేరళలో కదులుతున్న రైలులో నుంచి టీటీఈని తోసేసి ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఎర్నాకుళం నుంచి పట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సదరు వ్యక్తిని టీటీఈ ప్రశ్నించారు. ఈ క్రమంలో టీటీఈని అతను తోసేయడంతో అవతలి పట్టాలపై పడ్డారని, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొని ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాలక్కాడ్ వద్ద నిందితుడు వినోద్‌ని పట్టుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ మూవీ రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రూ.100 కోట్ల దిశగా పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీ, కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ వంటి లీడర్లు పాల్గొననున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ఈ రోడ్‌షో సాగుతుంది. కాగా 2019లో రాహుల్.. 10లక్షల ఓట్లలో 7లక్షల ఓట్లు సాధించి గెలిచారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల శాంభవీ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలవనున్నారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. JDU సీనియర్ లీడర్ అశోక్ చౌదరి కుమార్తె అయిన శాంభవి ప్రస్తుతం మగధ్ యూనివర్సిటీలో PhD చదువుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో రెండు మ్యాచుల్లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో ప్లేయర్ మయాంక్ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మయాంక్ ఆడాలని కోరుకున్నారు. 150 KMPHకు పైగా వేగంతో బంతులు విసురుతూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.64,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ.69,870 పలుకుతోంది. ఇక కేజీ వెండి రూ.2000 పెరిగి రూ.84000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
TG: ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని KTR అన్నారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదని, చేతనైతే ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని సూచించారు. ‘ఫోన్ ట్యాపులు కాదు.. వాటర్ ట్యాప్‌లు మీద దృష్టి పెట్టాలి. సూట్‌కేసుల్లో ఢిల్లీకి డబ్బు మోసుకెళ్లడమే రేవంత్‌కు సరిపోతోంది. మేడిగడ్డ కొట్టుకుపోయిందన్న ప్రభుత్వం గాయత్రీ, నందీ పంప్‌హౌస్‌లను ఎలా స్టార్ట్ చేసింది’ అని ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ తర్వాత ఆప్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటికీ.. ఆ పార్టీలో యాక్టివ్‌గా ఉండే MP రాఘవ్ చద్దా కనిపించట్లేదు. దీంతో ఆయన ఎక్కడున్నారని, ఇండియాలో ఉన్నారా? లేక విదేశాలకు మకాం మార్చారా అని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, కంటి శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆయన యూకే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేపాల్‌లోని హోక్సే గ్రామంలో మాయమాటలు చెప్పి వందలాది మంది అవయవాలను తీసుకుంటున్నారు. ఖాఠ్మాండు చుట్టూ కొండల్లో ఉన్న ఈ గ్రామ ప్రజలు నిరుపేదలు కావడంతో డబ్బు ఆశ చూపి అవయవాలు కొంటున్నారు. అయితే, కిడ్నీని తొలగించినప్పటికీ అక్కడే మరొకటి పెరుగుతుందని నమ్మబలికారని ప్రజలు చెబుతున్నారు. అవయవాల తొలగింపు కోసం వీరిని ఇండియాకు తరలించేవారట. ఊరిలో ఎక్కువ శాతం మంది ఒక కిడ్నీతోనే ఉన్నారని సమాచారం.
Sorry, no posts matched your criteria.