News April 2, 2024

నేటితో వీరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది..

image

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. వారిలో AP నుంచి ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కనకమేడల రవీంద్ర, TG నుంచి రవిచంద్ర, లింగయ్య, జోగినపల్లి సంతోష్ ఉన్నారు. వీరి స్థానంలో APలో YCP నుంచి మేడా శివనాథ్, సుబ్బారెడ్డి, బాబూరావు, TGలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్(INC), వద్దిరాజు రవిచంద్ర(BRS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News April 2, 2024

ఏప్రిల్ ఫూల్ చేద్దామని ‘ఉరి’ డ్రామా.. అనూహ్యంగా మృతి

image

స్నేహితుడిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నించి అభిషేక్ అనే విద్యార్థి అనూహ్యంగా మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఉరి తాడుని మెడకు బిగించుకుని ఆ విద్యార్థి.. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేశాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఇంతలో తాను నిలబడ్డ కుర్చీ పడిపోవడంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2024

స్టాక్ మార్కెట్లలో ఎన్నికల జోష్ కనిపించదేం?

image

సాధారణంగా ఎన్నికల వేళ జోరు ప్రదర్శించే స్టాక్ మార్కెట్లలో ఈసారి ఆశించినంత జోష్ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం, అవినీతి ఆరోపణలు మొదలైన అంశాలు సంచలనమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారట. మార్కెట్ల జోష్‌ BJP గెలుపుతో ముడిపడి ఉందని.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మార్కెట్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు.

News April 2, 2024

పెన్షన్లు ఆపేసి ప్రతిపక్షాలపై బురద: జనసేన

image

పెన్షన్లపై CM జగన్ ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని జనసేన విమర్శించింది. ‘వాలంటీర్లతో వికృత చేష్టలు చేయించుకోవడం ఇక సాధ్యం కాదు అని తెలిసి పెన్షన్ల పంపిణీకి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నా కూడా పెన్షన్లు ఆపేసి ప్రతిపక్షాలపై బురద చల్లుతున్న అసలైన పెత్తందారుడు జగన్!’ అని ట్వీట్ చేసింది. వాలంటీర్లు లేకుండా కేంద్రం 3 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తుంటే.. జగన్ ఇవ్వలేకపోతున్నారని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

News April 2, 2024

భర్త మేనకోడలిని కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. తన భర్త మేనకోడలిని(మైనర్) కిడ్నాప్ చేసిన భార్య.. ఆ బాలికను పెళ్లి చేసుకుంది. లైంగికంగా వేధించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు. తాను లెస్బియన్ అని, బాలికతో శారీరక సంబంధం ఉందని సదరు మహిళ చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2024

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

image

AP: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. పింఛన్ల పంపిణీని సీఎం జగన్ సరిగా నిర్వర్తించటం లేదు. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News April 2, 2024

BREAKING: లక్నోతో మ్యాచ్.. RCB టార్గెట్ 182 రన్స్

image

RCBతో మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 స్కోర్ చేసింది. డికాక్ 81, కేఎల్ రాహుల్ 20, స్టొయినిస్ 24, పూరన్ 40* పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు, టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీశారు. విజయం కోసం బెంగళూరు 182 రన్స్ చేయాలి.

News April 2, 2024

వేసవిలో ఈ ఆహారం తింటున్నారా?

image

వేసవిలో చాలామంది స్పైసీ ఫుడ్ తింటుంటారు. కానీ స్పైసీ, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అల్లం, మిరియాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల కడుపులో యాసిడ్ పెరిగి ఛాతీలో మంట, కడుపు నొప్పి వస్తాయి. అలాగే తలనొప్పి, వికారం, కడుపు ఉబ్బరం సమస్యలకు దారి తీస్తుంది. స్పైసీ ఫుడ్ వల్ల వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేసవిలో స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్.

News April 2, 2024

బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?

image

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బ్రెజిల్ నటితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 26 ఏళ్ల ఆర్యన్.. 34 ఏళ్ల నటి లారిస్సా బోనేసితో కలిసున్న వీడియో వైరల్ అవుతుండటం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. అంతేకాక తన అరంగేట్ర సినిమాతో బిజీగా ఉన్న ఆర్యన్ ఇన్‌స్టాలో లారిస్సా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారట. ఇటీవల లారిస్సా తల్లి బర్త్ డే సందర్భంగా విలువైన బహుమతిని కూడా అందజేసినట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

News April 2, 2024

మోదీతో రేవంత్ రహస్య ఒప్పందం: బాల్క సుమన్

image

TG: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని BRS నేత బాల్క సుమన్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ నుంచి రేవంత్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. మల్కాజిగిరి, చేవెళ్ల, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీపై బలహీన అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో ఉన్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి మోదీతో రహస్య ఒప్పందం చేసుకున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

error: Content is protected !!