News April 2, 2024

500 మంది ఉద్యోగులకు బైజూస్ ఉద్వాసన

image

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్న ఎడ్‌టెక్ సంస్థ బైజూస్.. తాజాగా 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయినవారిలో సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. పని తీరు సరిగా లేని వారిని తొలగిస్తున్నట్లు ఫోన్‌లోనే తెలియజేసినట్లు నేషనల్ మీడియా తెలిపింది. నోటీస్ పీరియడ్ ఇవ్వలేదని, పనితీరు మెరుగుపరుచుకునే అవకాశమూ కల్పించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

News April 2, 2024

అందం కోసం 43 సర్జరీలు.. ఎలా మారిందో చూడండి!

image

ఇరాక్‌కు చెందిన దాలియా నయీమ్(30) అనే యువతి బార్బీగర్ల్‌లా మారడం కోసం ఏకంగా 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. ముఖం, ముక్కు, వక్షోజాలకు ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఆమె పెదవులు లావుగా అయిపోయి ఫేస్ విచిత్రంగా మారిపోయింది. కొందరు ఆమెను జాంబీ గర్ల్, డెవిల్ బార్బీ అని పిలుస్తున్నారు. దాలియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

News April 2, 2024

అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి: సత్యకుమార్ యాదవ్

image

AP: బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేస్తున్న ఆయన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బాబుతో చర్చించినట్లు తెలిపారు. ‘ఏపీలో వైసీపీ అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుంది. అంధకారం తొలగి వెలుగులు ప్రసరించనున్నాయి’ అని సత్యకుమార్ ట్వీట్ చేశారు.

News April 2, 2024

స్కూళ్లలో రోజుకు 3సార్లు వాటర్‌బెల్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: ఎండలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఆదేశించింది. ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు బెల్ కొట్టాలని సూచించింది. విద్యార్థులు క్రమం తప్పకుండా మంచి నీటిని తాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

News April 2, 2024

Incognito యూజర్లకు గుడ్‌‌ న్యూస్

image

మీరు గూగుల్‌లో Incognito మోడ్ వాడుతున్నారా? అయితే మీకిది కచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే.. Incognito మోడ్ వాడే యూజర్ల నుంచి కలెక్ట్ చేసిన డేటాను డిలీట్ చేసేందుకు గూగుల్ అంగీకరించింది. చాలామంది ప్రైవసీ కోసం ఈ సదుపాయాన్ని వాడుతుంటారు. అయితే యూజర్ల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించినందుకు 2020లో దావా దాఖలైంది. దాన్ని పరిష్కరించేందుకు తాజాగా గూగుల్ డేటాను డిలీట్ చేస్తామని చెప్పింది.

News April 2, 2024

టాలీవుడ్‌లో విషాదం.. 2 రోజుల్లో ముగ్గురు మృతి

image

తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లోనే ముగ్గురు మరణించారు. డబ్బింగ్ రచయిత <<12970907>>శ్రీరామకృష్ణ<<>>(74) చెన్నైలో కన్నుమూశారు. ఈయన జెంటిల్‌మాన్, చంద్రముఖి సహా 300+ చిత్రాలకు పనిచేశారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ <<12972286>>సుదర్శన్<<>> గుండెపోటుతో, కమెడియన్‌ <<12975511>>విశ్వేశ్వరరావు<<>> అనారోగ్యంతో చనిపోయారు.

News April 2, 2024

పెన్షన్లు: ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

image

AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలంటూ గుంటూరుకు చెందిన మహిళ హైకోర్టును కోరారు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.

News April 2, 2024

ట్రెండింగ్: #DontHateHardik

image

ముంబై కెప్టెన్సీ మార్పు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రోహిత్ శర్మకు గౌరవం ఇవ్వకుండా అకస్మాత్తుగా తొలగించి, హార్దిక్ పాండ్యకు సారథ్యం అప్పగించడాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో #DontHateHardik అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు పాండ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ కూడా భారత ఆటగాడేనని, ఈ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

News April 2, 2024

పింఛన్ల పంపిణీపై రాజకీయం ఎందుకు?: పురందీశ్వరి

image

AP: పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలపై నెపాన్ని నెట్టేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఫైరయ్యారు. ఎన్నికల టైమ్‌లో ఈ వ్యవహారాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. 2019కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించేవారని గుర్తు చేశారు. పింఛన్లకు సీఎం జగన్ ఎందుకు బటన్ నొక్కడం లేదని, ఇందులో ఉన్న అడ్డంకులేంటని నిలదీశారు.

News April 2, 2024

MI కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి కామెంట్స్

image

ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమ్ ఇండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందించారు. ‘రోహిత్, హార్దిక్ కెప్టెన్సీల వ్యవహారంలో ఇంకా బెటర్‌గా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ ఎవరిని కెప్టెన్ చేయాలనేది యజమానుల నిర్ణయం. వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్లిష్టం’ అని తెలిపారు. కాగా, ముంబై సారథిగా ఎవరు ఉండాలని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన పోలింగ్‌లో రోహిత్‌కు 85%, పాండ్యకు 15% ఓట్లు వచ్చాయి.

error: Content is protected !!