India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, కాకినాడ – పల్లంరాజు, బాపట్ల – జేడీ శీలం, కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్ లోక్‌సభ బరిలో ఉన్నారు.
మల్కాజిగిరి స్థానంలో తమ పోటీ బీజేపీతోనేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. శామిర్‌పేటలో జరిగిన మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో మళ్లీ వెనుకటి రోజులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని రేవంత్ నిజాయితీగా ముందే చెప్పాడు. మనమే ప్రజలకు సరిగ్గా చెప్పలేదు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. మన పోటీ కచ్చితంగా బీజేపీతోనే’ అని పేర్కొన్నారు.
AP: పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్ తూరంగిలో వెంకట్రావ్(70) అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.
చారిత్రక ఘట్టమైన 2011 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశారు. అద్భుతమైన టీమ్‌తో మరిచిపోలేని జ్ఞాపకాలు అంటూ WC అందుకున్న ఫొటోలను షేర్ చేశారు. రైనా 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా.. సెమీస్‌లో పాకిస్థాన్‌పై గెలవడంలోనూ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
‘జై శ్రీరామ్’ నినాదాలు చేసే పిల్లలకు బీఆర్ఎస్ కార్యకర్తలు నచ్చజెప్పాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ‘మనదే నిజమైన సెక్యులర్ పార్టీ అని ప్రతి క్రిస్టియన్, ముస్లిం సోదరుడికీ చెబుదాం. జై శ్రీరామ్ నినాదాలు చేసే పిల్లలకు అది కడుపు నింపదని, ఉద్యోగం ఇవ్వదని చెప్పండి. మీకోసం పార్లమెంటులో మాట్లాడేవాళ్లు, కొట్లాడేవాళ్లు కావాలి అని వారికి అర్థమయ్యేలా వివరించండి’ అని సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని సూచించింది. అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ కేసులో సంజయ్ 6 నెలల పాటు జైలులో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు.
TG: కాంగ్రెస్ 100 రోజుల పాలనపై విపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. వేసవిలో తాగునీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయన్నారు. కేసీఆర్ గౌరవం నిలుపుకోవాలని సూచించారు. పంట బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని పాలిస్తామని అన్నారు.
భారత్ రెండో వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని 13 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నిజమైంది. 100 కోట్లకు పైగా అభిమానుల మద్దతుతో ఈ జ్ఞాపకాలను అందించిన జట్టుకు కృతజ్ఞతతో ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీలో సచిన్ 482 పరుగులు చేశారు.
తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన దళపతి విజయ్‌కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(గోట్) సినిమాయే ఆఖరిది అని వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నానని, అదే తనకు ఆఖరిదని విజయ్ ప్రకటించారు. పూర్తిగా రాజకీయ కోణంలో సాగే ఓ కథను హెచ్ వినోత్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్‌గా ఉంటుందని దళపతి భావించినట్లు తెలుస్తోంది.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు.. వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీ అని విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలకు రాష్ట్రంలో వర్షాలు పడలేదన్నారు. హరీశ్ రావు మాటలకు అర్థం లేదని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.