News April 1, 2024

ఏప్రిల్‌ 1నుంచి వచ్చే మార్పులు ఇవే

image

➣అన్ని బీమా పాలసీలు డిజిటలైజ్
➣ NPS ఖాతాలకు టూ ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్
➣ పలు SBI డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.75 వరకు పెంపు
➣ ఈడీఎఫ్‌లో ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేయాలని అసెట్ మేనేజర్లకు సెబీ ఆదేశాలు
➣ SBI, AXIS, YES బ్యాంకుల క్రెడిట్ కార్డుల రూల్స్‌లో మార్పులు

News April 1, 2024

ధోనీ కమిట్మెంట్ ఇలాగే ఉంటుంది

image

నిన్న ఢిల్లీతో మ్యాచులో ధోనీ బ్యాటింగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన ఎడమకాలుకు పట్టీతో కనిపించారు. ఢిల్లీ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించారు. 42 ఏళ్ల వయసులోనూ ఆయనకు ఆట పట్ల ఉన్న కమిట్మెంట్ చూస్తుంటే గర్వంగా ఉందని.. యువ ఆటగాళ్లకు పర్ఫెక్ట్ రోల్ మోడల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా మ్యాచ్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌తో ధోనీ ఫొటో దిగడం గమనార్హం.

News April 1, 2024

‘మెక్‌క్లెనాఘన్‌.. ఏప్రిల్ ఫూల్ చేయొద్దు’

image

న్యూజిలాండ్ బౌలర్ మిచెల్‌ మెక్‌క్లెనాఘన్‌ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఇది అఫీషియల్. రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నా. IPL ఫ్రాంచైజీల నుంచి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు. దీనికి ‘మెక్‌క్లెనాఘన్‌.. ఏప్రిల్ ఫూల్ చేయొద్దు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మెక్‌క్లెనాఘన్‌ 2019లో తన చివరి IPL మ్యాచ్ ఆడారు. మొత్తంగా 56మ్యాచుల్లో 71 వికెట్లు తీశారు.

News April 1, 2024

ఎలక్టోరల్ బాండ్స్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాదు: PM మోదీ

image

ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కాదని ఆయన అన్నారు. ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదని, ఏ లోపాలున్నా సవరించవచ్చని అన్నారు. తమకు ఎందుకు ఎదురు దెబ్బ అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై చంకలు గుద్దుకుంటున్న వారు పశ్చాత్తాప పడక తప్పదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా BJPకి అత్యధికంగా విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే.

News April 1, 2024

టోల్‌ప్లాజాల పన్నుల ధరలు పెరిగాయి

image

హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపుకు ₹5, రానూపోనూ కలిపి ₹10, భారీ రవాణా వాహనాలకు ₹35, ₹50 చొప్పున పెంచారు. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. పంతంగి వద్ద కారు ఒకవైపు ధర రూ.95, రానూపోనూ రూ.145, కొర్లపహాడ్ వద్ద రూ.130, రూ.195, చిల్లకల్లు వద్ద రూ.110, రూ.160గా ఉన్నాయి.

News April 1, 2024

‘ఏప్రిల్ ఫూల్’ అయ్యారా?

image

ఏప్రిల్ 1న సరదాగా స్నేహితులను ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇలా ఆట పట్టించడంలో పిల్లలు ముందు వరుసలో ఉంటారు. ‘నీ షర్ట్ కు ఏదో అంటుకుంది’, ‘నిన్ను ఎవరో పిలుస్తున్నారు’ అంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. కొందరైతే ఫూల్ చేసేందుకు ముందుగానే ప్రణాళికలు చేస్తుంటారు. ఇంతకీ మీరెప్పుడైనా ఫూల్ అయ్యారా? లేదా మీరు ఎవరినైనా ఫూల్ చేశారా? కామెంట్ చేయండి.

News April 1, 2024

ఈ విషయాల్లో ‘ఫూల్’ అవ్వొద్దు!

image

ఏప్రిల్ 1.. ఈరోజు స్నేహితులు, బంధువులు అబద్ధాలతో ఫూల్‌ను చేస్తుంటారు. దీంతో పెద్ద నష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో ఫూల్ అవ్వకుండా జాగ్రత్త పడాలని పలువురు సూచిస్తున్నారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియాలో సంబంధాలు, ఆఫర్ల పేరిట బురిడీ కొట్టించే లింకులు క్లిక్ చేయడం, ఇతరులను గుడ్డిగా నమ్మడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఆన్‌లైన్ పరంగా ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు.

News April 1, 2024

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ

image

AP: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న మరో పిటిషన్‌ను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. రాష్ట్రంలో ఎన్నికల వేళ కోర్టులో ఈ పిటిషన్లు విచారణకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News April 1, 2024

రాజకీయ ‘పెళ్లి పత్రిక’

image

ఈ మధ్య వివాహ ఆహ్వాన పత్రికల్లో తమకు ఇష్టమైన నేతలపై అభిమానాన్ని చాటుకునేందుకు కొందరు ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఓ పెళ్లి పత్రిక వైరలవుతోంది. కారెం సంజయ్ వివాహం చంద్రికారాణితో జరగనుంది. ఈ క్రమంలో పత్రికపై తన అభిమాన నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలను ముద్రించి పంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

News April 1, 2024

కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క

image

TG: మిషన్ భగీరథపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క బహిరంగ లేఖ విడుదల చేశారు. గత ప్రభుత్వం కన్నా సమర్థవంతంగా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని.. అర్థం లేని విమర్శలు సరికాదని పేర్కొన్నారు.

error: Content is protected !!