India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తక్కువ ధరకే టారిఫ్‌లను అందిస్తున్న BSNL మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశమే లేదని సంస్థ CMD రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసం పొందడం, వారిని సంతోషంగా ఉంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే 4G సేవలను ప్రారంభించామని, ఈ డిసెంబర్ లోపు దేశవ్యాప్తంగా వాటిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు.

తూర్పు లద్దాక్ సరిహద్దు వివాదానికి ముగింపు పలికేలా భారత్‌తో ఒప్పందానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘సరిహద్దు సమస్యలకు సంబంధించి దౌత్య, సైనికపరమైన విధానాల్లో భారత్‌తో చర్చించాం. తాజాగా ఇరు పక్షాలు ఓ పరిష్కారానికి వచ్చాయి’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. గడచిన నాలుగేళ్లుగా తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.

ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మాధబీ పురీకి పార్లమెంటు PAC క్లీన్‌చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదానీ షెల్ కంపెనీల్లో మాధబీకి వాటాలున్నాయని, ఆమె ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారంటూ హిండెన్‌బర్గ్, కాంగ్రెస్ ఆరోపించాయి. దీనిపై విచారణ జరిపిన PAC మాధబీ అవకతవకలకు పాల్పడలేదని తేల్చినట్టు సమాచారం. దీంతో ఆమె Feb, 2025 వరకు సెబీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగే అవకాశముంది.

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఏ సీఎం చేయనన్ని దుర్మార్గాలు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. ఆయన చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని TN Dy.CM ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మహిళల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా, ద్రవిడ నేతలు పెరియర్, అన్నాదురై, కరుణానిధి అభిప్రాయాలనే తాను వ్యక్తం చేశానని పేర్కొన్నారు. సనాతన ధర్మం ఎయిడ్స్ లాంటిదని, దీన్ని వ్యతిరేకించడమే కాకుండా పూర్తిగా నిర్మూలించాల్సిందేనని గతంలో వ్యాఖ్యానించారు.

అమెరికాలో 170 సంవత్సరాలుగా నవంబర్‌లో మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1800లలో USలో ఎక్కువగా రైతులే ఉండేవారు. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు ఎన్నికలు జరిపేందుకు నవంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణాన్ని ఇష్టపడనందున సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా వీకెండ్స్‌లో ఓటింగ్ నిర్వహించాలంటున్నారు.

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విద్యార్థినులపై అత్యాచారం చేసిన నిందితులకు TDPతో సంబంధాలు ఉన్నాయని YCP ఆరోపించింది. నిందితుడు శివ బంధువు జానకీరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, మరో నిందితుడు మోహన్ వాళ్ల మామ ఎమ్మెల్యే గౌతు శిరీషకు అనుచరుడని తెలిపింది. దీంతో బాధితులకు నిందితులకు మధ్య రాజీకి ప్రయత్నాలు చేశారని పేర్కొంది. కూటమి నేతలు శాడిస్ట్‌లను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టింది.

AP: కాస్ట్ సహా ఇతర సర్టిఫికెట్లు, పౌరసేవలు వాట్సాప్‌లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు. నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, AI ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించనుంది.

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దామగుండం రాడార్ స్టేషన్‌పై పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తిడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. ఆయనకు కష్టమంటే తెలియదని చెప్పుకొచ్చారు. రేవంత్ కష్టపడి ఎదిగారని, ప్రజల బాధలు ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారని జగ్గారెడ్డి అన్నారు.
Sorry, no posts matched your criteria.