India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్‌రామ్‌గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AIతో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్‌పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

AP: వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫుడ్‌ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది.

TG: డీఎస్సీ టీచర్ల పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ టీచర్లకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉండగా, కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకున్న సంగతి తెలిసిందే.

దేశరక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు స్మరించుకుంటున్నారు. పేపర్ బాయ్‌గా పనిచేసిన ఆయన ఏరో స్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారని కొనియాడుతున్నారు. DRDO, ISROలో చేరి క్షిపణిశాస్త్ర విజ్ఞాన రంగంలో చిరస్మరణీయ సేవలు అందించిన భారత రత్నకు జోహార్లు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

AP: తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. 17 ఏళ్లుగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పదోన్నతులు, మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, రిటైర్మెంట్ పొందిన వారికి రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

TG: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్‌షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్‌తో కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.

భారతరత్న అమర్త్య సేన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘నోబెల్’ ట్విటర్‌లో పంచుకుంది. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందడంలో ఆయన సైకిల్ కీలక పాత్ర పోషించిందని తెలిపింది. ‘మగ, ఆడపిల్లల మధ్య తేడాలపై పరిశోధన చేసేందుకు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌పైనే తిరిగేవారు. పిల్లల బరువును తానే స్వయంగా కొలిచేవారు. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో ఆయన సహాయం చేశారు’ అని నోబెల్ పేర్కొంది.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇవాళ మ.3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

బ్రిటన్ PM కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసినట్టు కెనడా PM జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. తమ పౌరులపై భారత ప్రభుత్వ ఏజెంట్ల టార్గెటెడ్ క్యాంపెయిన్‌ను వివరించానన్నారు. ప్రజల భద్రత, క్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంపై చర్చించామన్నారు. ఈ సీరియస్ మ్యాటర్ పరిష్కారానికి భారత్ సహకారం తీసుకొనేందుకు ఆసక్తిగా ఉన్నానన్నారు. జియోపాలిటిక్స్‌లో ప్రాధాన్యం తగ్గిన UKకు ఫోన్ చేస్తే లాభమేంటని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
Sorry, no posts matched your criteria.