India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. దీనిలో భాగంగా ఇవాళ 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డిలోని షాద్‌నగర్ వద్ద సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం ఈ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.

దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.

ప్రజల కోసం పరితపించిన సమాజ సేవకుడిగా, నిత్య కృషీవలుడిగా రతన్ టాటా కీర్తి భూమిపై అజరామరం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మహనీయుడి జీవితం ముందు తరాలకూ గుర్తుండేలా ఆయనపై ఓ బయోపిక్ తీయాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. లక్షల జీవితాల్లో వెలుగులు నింపిన ‘రత్నం’లాంటి ఆ మనిషి కృషి ఎన్ని తరాలైనా మరచిపోని రీతిలో తెరకెక్కాలంటూ అభిమానులు కోరుతున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ తీసుకుంటుందేమో చూడాలి.

1970-2020 మధ్యకాలంలో(50 ఏళ్లు) ప్రపంచంలోని జంతుజాలంలో 73శాతం అంతరించిపోయింది. ప్రపంచ వన్యప్రాణి నిధి(WWF) సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అడవుల నరికివేత, వేట, పర్యావరణ మార్పులు దీనికి కారణమని తెలిపింది. మంచినీటి జీవజాతులైతే ఏకంగా 85శాతం మేర తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర జీవాలకు, మనుషులకు, ప్రకృతికి కూడా ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించింది.

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ జననం
1978: దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం
Sorry, no posts matched your criteria.