India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. ఈ నిర్మాణ సంస్థ చేతిలో బడా హీరోల చిత్రాలు లాక్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రీకరణ కొనసాగుతోండగా.. చెర్రీ-సుకుమార్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, గుడ్ బ్యాడ్ అగ్లీ(అజిత్), రాబిన్ హుడ్(నితిన్), విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ మూవీలతో పాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
పంజాబ్, ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటేటర్లు స్కాట్ స్టైరిస్, డివిలియర్స్ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. ఈ మ్యాచులో ఆర్సీబీ గెలిస్తే ఇకపై RCB మ్యాచ్ ఆడినప్పుడల్లా ఆ జట్టు జెర్సీ ధరిస్తానని స్కాట్ అన్నారు. అదే ఆర్సీబీ ఓడితే తాను రేపు CSK జెర్సీ ధరిస్తానని డివిలియర్స్ పేర్కొన్నారు. వీరిద్దరి సవాల్‌కు సాక్ష్యంగా ఉతప్ప ఉన్నారు. వీరిలో ABD ఆర్సీబీ తరఫున ఆడగా.. స్కాట్ CSK తరఫున ఆడారు.
వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు తమ అవతార్‌ను ఇతరులెవరూ స్టిక్కర్స్‌లో వాడకుండా నియంత్రించవచ్చు. ఎవరెవరు మన అవతార్‌ని వాడుకోవచ్చో నిర్ణయించుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. ఇందులో మై కాంటాక్ట్స్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, Nobody అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే AP వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.
AP:ప్రకాశం జిల్లాలో YCPకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. ఈ నెల 27న TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు TDP హైకమాండ్ సానుకూలంగా ఉందట. అటు YCP టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది.
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది. తమిళనాడు పర్యటనలో భాగంగా మాజీ సీఎం కామరాజ్‌ను ప్రశంసించినందుకు ప్రధానిపై ఆయన అసహ్యకరంగా, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిద్రంగనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెగ్ననపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 176/6 స్కోర్ చేసింది. శిఖర్ ధవన్(45), ప్రభ్‌సిమ్రన్ సింగ్(25), సామ్ కరన్(23), జితేశ్ శర్మ(27) రాణించారు. బెంగళూరు గెలవాలంటే 177 రన్స్ చేయాలి. RCB బౌలర్లలో సిరాజ్ 2, మాక్స్‌వెల్ 2, దయాల్ 1, జోసెఫ్ 1 చొప్పున వికెట్లు తీశారు.
TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్ష్మి పథకంతో RTCకి పూర్వవైభవం తీసుకొచ్చామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ 100 రోజుల్లోనే కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. అన్ని మతాలను, కులాలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు.
IPL ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న చెన్నైలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచుతో ముగియనుంది. ఏ జట్టు ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ ఆడనుందనే పూర్తి వివరాలు పైనున్న ఇమేజ్‌లలో చూడొచ్చు. వీటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SHARE IT
బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతోంది. దీంతో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కారు వాషింగ్, గార్డెన్లు, భవన నిర్మాణాలకు నీటిని వాడుతున్నారు. దీంతో అధికారులు 22 మందిపై కేసులు బుక్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షల ఫైన్ వసూలు చేశారు. మరోవైపు వేసవి నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.