India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి హోలికా దహనం (కాముడి దహనం) నిర్వహించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. పౌర్ణమి తిథి నిన్న ఉ.9 గంటలకు ప్రారంభమై.. నేడు మ.12.29 వరకు ఉండనుంది. ఈ సమయంలో హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చీకటి పడ్డాక హోలీ చేసుకుంటే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉందని చెబుతుంటారు.
IPL-2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడగా PBKS 17, RCB 14 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌ను పంజాబ్ విజయంతో ఆరంభించగా, ఆర్సీబీ ఓటమితో మొదలుపెట్టింది. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
నిన్న GTపై ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 5 టైటిల్స్ అందించిన సారథిని పక్కనబెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు చేస్తున్నారు. ‘రోహిత్ శర్మ రన్స్ చేయాలి, ముంబై ఓడిపోవాలి’ అనేదే తమ నినాదం అని చెబుతున్నారు. నిన్నటి మ్యాచులో రోహిత్ 43 రన్స్ చేశారు. మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభిప్రాయంపై మీ కామెంట్?
TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆధార్ నంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఏ డాక్టర్‌ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు సాధ్యమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగబద్ధ సంస్థల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఎస్సీలకు వైసీపీ రద్దు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలి’ అని చంద్రబాబును కోరారు.
TSRDC CET-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. ఈ పరీక్షకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన వారు అర్హులని, ఏప్రిల్ 12లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 21 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
IPLలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు కంటిన్యూ అవుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ప్రతిసారి తొలి మ్యాచులో ఓడుతూ వస్తోంది. వరుసగా 12 సీజన్లలో ఒక్కసారి కూడా గెలవలేదు. సారథిని మార్చినా ఫలితం మారలేదు. నిన్న GTపై గెలిచే స్థితిలో ఉన్నా చివరికి బోల్తా పడింది ముంబై.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఫార్చూనర్ కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాను సర్వీస్ సెంటర్ వద్ద కారు పార్క్ చేసి భోజనం చేసి వచ్చేసరికి కారును దొంగిలించారని దాని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గురుగ్రామ్‌వైపుగా ఆ కారు వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
TS: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలి. రసాయనాలు కలిగి ఉన్న రంగుల వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పండుగను సహజసిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలి’ అని సూచించారు. కాగా.. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
TS: లిక్కర్ కేసులో ఆధారాలున్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారని, ఆయన్ను ఈడీ విచారించాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు.. కాంగ్రెస్ మంత్రులు రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కరవుతో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం చేయట్లేదు. ఉత్తమ్‌కు నీటిపై పరిజ్ఞానం లేదు’ అని ఆయన మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.