India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్‌ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్, లోఖండ్‌వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.

సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్ అలీమ్ దార్‌ను పీసీబీ చేర్చుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా నియమించినట్లు తెలుస్తోంది. అఖీబ్ జావెద్, అసద్ షఫీఖ్, అజహర్ అలీ, హసన్ చీమాలను తీసుకున్నట్లు టాక్. కాగా అలీమ్ దార్ ఇటీవల అంపైరింగ్‌కు వీడ్కోలు పలికారు.

ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి వర్గాలకు మరింత లబ్ధి చేకూర్చేలా మార్పులు చేస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఇందులో కనీస పెన్షన్ పరిమితి రూ.1000 నుంచి పెంచడం, పదవీ విరమణ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి, సులభంగా నగదు విత్ డ్రా, నెలవారీ ఆదాయం రూ.15వేల కంటే ఎక్కువగా ఉన్నవారికి పెన్షన్ పథకాన్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.

మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు అగ్నివీర్ ట్రైనీలు ప్రాణాలు కోల్పోయారు. ట్రైనింగ్‌లో భాగంగా ఫైరింగ్ చేస్తుండగా ఆర్టిలరీ షెల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విశ్వరాజ్ సింగ్ (20), సైఫట్ షిట్ (21) మరణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నాసిక్‌లోని డియోలాలి శిక్షణాకేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అమెరికాలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. పేరు క్రోమింగ్. ఇంట్లోని నెయిల్ పాలిష్, మార్కర్లు, బోర్డు డస్టర్లు, మత్తు కలిగించే ఇతర వస్తువుల వాసన పీలుస్తూ వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడమే దీని ఉద్దేశం. గతంలోని హప్ఫింగ్, పప్ఫింగ్, ర్యాగింగ్, బ్యాగింగే ఇప్పుడిలా రూపాంతరం చెందాయి. హైడ్రో కార్బన్స్‌ను పీల్చే ఈ మాయదారి ట్రెండ్ వల్ల టీనేజర్స్, చిన్నారులు వ్యసనాలు, ఆస్తమా, గుండెజబ్బుల బారిన పడుతున్నారు.

TG: టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆయనకు అందించారు. కాగా గతంలోనే సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన <

AP: ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గతంలో EVMలపై చంద్రబాబే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మేం ప్రశ్నిస్తుంటే చంద్రబాబు మాపై కోప్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట మాట్లాడుతున్నారన్నారని, సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని గమనించాలన్నారు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కేవలం 3వేల పరుగుల దూరంలోనే ఉన్నారు. ఆ రికార్డును అందుకునే సత్తా రూట్‌కి ఉందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అన్నారు. ‘రూట్ కచ్చితంగా ఆ రికార్డును సాధిస్తారు. అయితే దాని కోసం అతడు సుదీర్ఘకాలం ఆడాలి. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కచ్చితంగా అలా ఆడతారనే అనుకుంటున్నా. రూట్ ఇప్పటికే ఓ దిగ్గజం’ అని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.