News October 16, 2024

దర్యాప్తు జరుగుతుండగా రిజైన్ చేసిన ముడా చీఫ్

image

ముడా స్కామ్‌ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.

News October 16, 2024

సురేఖపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ మధ్య <<14367710>>వివాదం<<>> ఢిల్లీకి చేరింది. సురేఖపై ఇప్పటికే దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమెపై ఢిల్లీలోని అధిష్ఠానానికి కంప్లైంట్ చేయనున్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.

News October 16, 2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

image

AP: కొత్త MSME పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామిక వేత్త అంశంతో ఈ పాలసీని రూపొందించింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలకు ఆమోదం తెలిపింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది.

News October 16, 2024

టెర్రరిజాన్ని బట్టే సరిహద్దుల్లో మా యాక్టివిటీస్: జైశంకర్

image

ఉగ్రవాదం, అతివాదమే సరిహద్దుల్లో యాక్టివిటీస్‌ను నిర్దేశిస్తాయని EAM జైశంకర్ అన్నారు. వాటితో వాణిజ్యం, ఇంధన సరఫరా, కనెక్టివిటీ జరగదని స్పష్టం చేశారు. ఇక UNSCలో విస్తృత ప్రాతినిధ్యం, సమ్మిళితత్వం, పారదర్శకత కోసం SCO చొరవ తీసుకోవాలని సూచించారు. సంస్కరణల వేగవంతానికి కృషి చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కోఆపరేషన్ వల్లే పోటీతత్వం, లేబర్ మార్కెట్లు విస్తరిస్తాయన్నారు. MSME కొలాబరేషన్, కనెక్టివిటీ అవసరమన్నారు.

News October 16, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

image

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా 3శాతం డీఏ పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరింది. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే కేంద్రం 4 శాతం డీఏను పెంచింది. మరోవైపు రబీ సీజన్ 2025-26కు సంబంధించి MSPని క్వింటాల్‌పై రూ.150 పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

News October 16, 2024

సీఎం రేవంత్‌ను కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ DSP

image

మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 19న కన్సర్ట్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ షోకు రావాలని ఆహ్వానించేందుకు డీఎస్పీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నిర్మాత బండ్ల గణేశ్‌తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌కు ఆయన గిటార్‌ను బహుమతిగా అందించారు. కాగా, HYDలో ఈ కన్సర్ట్ స్టార్ట్ చేసి దేశంలోని పలుచోట్ల నిర్వహించనున్నారు.

News October 16, 2024

IND Vs NZ: వర్షం తగ్గిందోచ్

image

బెంగళూరు స్టేడియంలో వర్షం తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఇవాళ ఉదయం కాస్త తగ్గింది. అంతలోనే మళ్లీ మొదలైంది. దీంతో భారత్-కివీస్ తొలి టెస్ట్‌కు టాస్ కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు వాన తగ్గగా ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. మరోసారి వర్షం కురవకపోతే ఆట ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కానీ బెంగళూరులో వాతావరణం ఇంకా వాన పడే విధంగానే ఉంది.

News October 16, 2024

AP TET అభ్యర్థులకు అలర్ట్

image

AP: ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. పేపర్ 1A, 1B ఆన్సర్ ‘కీ’తో పాటు క్వశ్చన్ పేపర్లు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీలోపు టెట్ <>వెబ్‌సైట్<<>> ద్వారా సమర్పించాలని సూచించింది.

News October 16, 2024

ఆ 3 పాపాలపై నో కాంప్రమైజ్: పాక్‌లో జైశంకర్

image

ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాటమే SCO ప్రాథమిక లక్ష్యమని EAM జైశంకర్ ఇస్లామాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది మరింత కీలకమన్నారు. SCOకు నిజాయితీ సంభాషణలు, నమ్మకం, పొరుగువారితో స్నేహం, ఛార్టర్‌కు కట్టుబడి ఉండటం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, సప్లై చైన్ అవాంతరాలు వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు అప్పులు ఆందోళనకరంగా మారాయని వెల్లడించారు.

News October 16, 2024

త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.