News October 15, 2024

భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

image

AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.

News October 15, 2024

రతన్ టాటా కుక్క బెంగతో చనిపోయిందా..? నిజమిదే!

image

స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్‌కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.

News October 15, 2024

మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలతో మనోభావాలు దెబ్బతినవు: హైకోర్టు

image

మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఓ మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారన్న ఆరోపణలపై దక్షిణ కన్నడ పోలీసులు గత ఏడాది ఇద్దర్ని అరెస్టు చేశారు. మసీదు బహిరంగ ప్రదేశం కావడం, స్థానికంగా మతసామరస్యంతో ఉంటున్నామని ఫిర్యాదుదారే చెప్పిన నేపథ్యంలో నిందితులు చేసింది క్రిమినల్ నేరం కిందికి రాదని కోర్టు అభిప్రాయపడింది.

News October 15, 2024

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్స్

image

☛ మిస్టర్ బీస్ట్- 320M (US) ☛ T సిరీస్ – 276M (IND)
☛ కోకోమెలన్ – 184M (US)
☛ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్- 178M (IND)
☛ కిడ్స్ డయానా షో – 126M (ఉక్రెయిన్-US)
☛ వ్లాడ్ అండ్ నికి -125M (రష్యా) ☛ లైక్ నాస్త్య- 121M (రష్యా-US)
☛ PewDiePie – 111M (స్వీడన్)
☛ జీ మ్యూజిక్- 111M (IND) ☛ WWE – 104M (US)

News October 15, 2024

వాయుగుండం.. ఎల్లుండి తీరం దాటే అవకాశం

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490KM, పుదుచ్చేరికి 500KM, నెల్లూరుకు 590KM దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఈ నెల 17న పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

News October 15, 2024

రేపు శ్రీశైలం గేట్లు ఓపెన్

image

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద, ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. దీంతో రేపు ఉదయం 7 గంటలకు డ్యాం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 5వ సారి గేట్లు ఎత్తనున్నారు. ప్రస్తుతం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటితో ఔట్‌ఫ్లో 66,067 క్యూసెక్కులుగా ఉంది.

News October 15, 2024

నాని సినిమాలో శ్రద్ధాకపూర్?

image

‘దసరా’తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్‌ను ఫిమేల్ లీడ్‌గా తీసుకోవాలనుకుంటున్నారని టాలీవుడ్ టాక్. శ్రద్ధ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ స్త్రీ-2 ఏకంగా రూ.600+ కోట్లు కొల్లగొట్టింది.

News October 15, 2024

గ్ర‌హాంత‌ర వాసుల‌పై వ‌చ్చే నెల కీల‌క ప్ర‌క‌ట‌న‌: నాసా ఫిలింమేక‌ర్‌

image

ఆస్ట్రేలియాలోని Parkes Telescope గ్ర‌హాంత‌ర జీవుల సంకేతాల‌ను గుర్తించినట్టు NASA ఫిలింమేక‌ర్ సైమ‌న్ హాలండ్ తెలిపారు. దీనిపై వ‌చ్చే నెల కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. Oxford University ఆధ్వ‌ర్యంలో యూరి మిల్నర్, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ స‌మర్పించిన Breakthrough Listen ప్రాజెక్టులో భాగంగా ఈ విష‌యాలు వెలుగుచూసిన‌ట్టు తెలిపారు. ఈ సమాచారాన్ని జుకర్‌బర్గ్ ప్రాజెక్ట్ వ్యక్తులు వెల్లడించారన్నారు.

News October 15, 2024

టీమ్ ఇండియా కెప్టెన్‌ను మార్చాల్సిన టైమ్ వచ్చింది: మిథాలీ రాజ్

image

టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టు సారథిని మార్చాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. ‘యువ కెప్టెన్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపాలనేది నా అభిప్రాయం. అందుకు ఇదే సరైన సమయం. మరో వరల్డ్ కప్ వచ్చేసరికి జట్టు సిద్ధంగా ఉండాలి. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఇద్దరూ కెప్టెన్సీకి అర్హులే’ అని పేర్కొన్నారు.

News October 15, 2024

రాత్రి తినకుండా పడుకుంటున్నారా?

image

రాత్రి పూట భోజనం మానేస్తే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తుంటారు. కానీ భోజనానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలసట, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తలెత్తుతాయి. పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే కొంచెమైనా తిని పడుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.