India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాల్పుల విరమణకు అంగీకరించినా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చిందని లెబనాన్ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ తెలిపారు. ‘హత్యకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులకు కూడా తెలియజేశాం. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన కాసేపటికే బంకర్‌లో తలదాచుకున్న నస్రల్లాను నెతన్యాహు హత్య చేయించారు’ అని ఆయన వెల్లడించారు.

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతాం’ అని హెచ్చరించారు.

TG: ప్రజల ఆవేదన, మనోవేదనను అర్థం చేసుకుని కూల్చివేతలు ఆపాలని సీఎం రేవంత్‌కు లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పేదలపై రేవంత్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘డ్రైనేజీ సమస్య తీర్చకుండానే మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డ్రైనేజీ పైపులను మూసీలో కలుపుతున్నారు. కలుషితమైన నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

యువత కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘PM INTERNSHIP’ పథకానికి సంబంధించిన పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది. 21-24 ఏళ్ల నిరుద్యోగులు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. వారి విద్యార్హత, ఆసక్తి ఉన్న రంగాలను బట్టి టాప్-500 కంపెనీలలో 12 నెలల ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. నైపుణ్య శిక్షణతోపాటు ఒకేసారి రూ.6,000, ప్రతి నెలా రూ.5,000 అలవెన్సును అందజేస్తుంది.

మెడిసిన్స్, ట్రాక్టర్స్ సహా ఎక్కువ ఉపయోగించే ఐటమ్స్‌పై GST రేటును 5 శాతానికి తగ్గించాలని మంత్రుల ప్యానెల్ యోచిస్తోందని తెలిసింది. సిమెంటు, టొబాకో వంటి వాటిపై 28% కొనసాగొచ్చు. ప్రస్తుతం కొన్ని ట్రాక్టర్లపై 12 లేదా 28% వరకు ట్యాక్స్ ఉంది. హై ఎండ్ EVs, రూ.40 లక్షల కన్నా విలువైనవి, ఇంపోర్ట్ వెహికల్స్‌పై 5% నుంచి పెంచొచ్చు. కేరళ సహా సౌత్ స్టేట్స్ ఇష్టపడకపోవడంతో శ్లాబుల్ని తగ్గించే పరిస్థితి లేదు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్‌లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్‌లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్‌లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కి.మీకు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కి.మీకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. అనిశ్చితి నెలకొనడం, సప్లై చైన్ అవాంతరాలు, క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల భారీగా క్రాష్ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ 725 పాయింట్ల నష్టంతో 83,542, NSE నిఫ్టీ 218 పాయింట్లు ఎరుపెక్కి 25,578 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. నిఫ్టీలో 41 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్.

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన <<14254371>>వ్యాఖ్యలపై <<>>హీరో అల్లు అర్జున్ స్పందించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.