India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత్ స్పందించింది. చేజారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు మరింత ఉగ్రరూపం దాల్చకూడదని అభిప్రాయపడింది. సమస్యల్ని చర్చలు, దౌత్య విధానాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది. హెజ్బొల్లా చీఫ్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ నిన్న 200 క్షిపణుల్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.

AP: బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి ఇంగితజ్ఞానం లేకుండా కోర్టులు, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టుదే మొత్తం తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడవచ్చట. ఆమెది ‘బావా‘తీతమైన ఆవేదన అనుకోవాలా? తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజీ ఎవరూ చేయలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

కూల్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూస్‌లతో పక్షవాతం బారిన పడే ముప్పు ఉందని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే అదనపు చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు పక్షవాతానికి దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్‌లు, రోజుకి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందని తెలిపారు. బ్లాక్ టీ, రోజుకి ఏడు కప్పుల కన్నా ఎక్కువ నీరు తాగడం పక్షవాతం ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.

AP: కాల్ మనీ దందాపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో ప్రజల్ని వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లే టార్గెట్‌గా సాగించే వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మహిళా ఉద్యోగులు గర్భందాల్చినపుడు 6 నెలల వరకు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ‘మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961’ ప్రకారం దేశంలో గుర్తింపు పొందిన ప్రతి సంస్థ దీనిని అమలు చేయాల్సిందే. అయితే, దేశాల వారీగా ఈ సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. అత్యధికంగా యూరప్‌లోని సాన్ మారినోలో 635 రోజుల ప్రసూతి సెలవులుంటాయి. ఆ తర్వాత బల్గేరియా (410), అల్బేనియా(365), బోస్నియా (365), చైనా (158), UK (42) ఉన్నాయి.

ఢిల్లీలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్‌ను పోలీసులు ఛేదించారు. 560 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2,000కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. నార్కో-టెర్రర్ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది.

TG: సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 10న సెలవు ఉండనుంది.

ముడా స్కామ్, ED నోటీసులు, లోకాయుక్త కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బాపూ జీవితం, ఆయన ఆలోచనలే తనకు ధైర్యం ఇస్తున్నాయని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మతతత్వం, నియంతృత్వం, హింసతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ, సత్య స్వరూపం, శాంతి, అహింసే మన చేతిపట్టి నడిపిస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఆయనపై లోకాయుక్త FIR, ఈడీ ECIR రిజిస్టర్ చేయడం తెలిసిందే.

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.