India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతామని సిట్టింగ్ MLA పెండెం దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. YCP అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తెలిపారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని తేల్చిచెప్పారు.
TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
మద్యం పాలసీ కేసులో అరెస్టయినప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ CMగా కొనసాగుతారని AAP స్పష్టం చేసింది. అయితే ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే లేదా ఆయనకు శిక్ష పడితే నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. రిటైర్డ్ IRS అధికారిణి అయిన ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ CM భగవంత్ మాన్‌కు అప్పగించే అవకాశముందని చెబుతున్నారు.
TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
AP: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేయడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
TG: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం పనులకు మార్చి 25న శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములు దంచుతారు. అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా.. నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
AP: తాను బీజేపీలోకి <<12896599>>వెళ్తున్నట్లు<<>> వచ్చిన వార్తలను అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ ఖండించారు. ‘నేను పార్టీ మారట్లేదు. గత ఎన్నికల్లో నన్ను గెలిపించేంత వరకు సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిది. ఈ ఐదేళ్లు ఎంతో అండగా నిలిచారు. ఆయనను నమ్ముకున్న వారికి భరోసాగా ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా రేసులో ఉన్న వ్యక్తికి, మా కుటుంబానికి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు.
TG: తాను బీజేపీ కానీ, మరే ఇతర పార్టీలతో కానీ టచ్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘రోజూ సీఎం రేవంత్ వెంట ఉంటే నంబర్ 2 అవుతానా? నేను సీఎం కావాలంటే మా అధిష్ఠానం కొన్ని సమీకరణాలు చూస్తుంది. నాకు సీఎం కావాలని లేదు. నాపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారు. నేను ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నానని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలను కేంద్రం పెంచనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో జీతాలు పెంచేందుకు ఈసీ అనుమతించింది. జీతాల పెంపు ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్త నిర్ణయం కాదన్న ప్రభుత్వ వివరణతో ఈసీ ఏకీభవించింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి.
CM పదవిలో ఉండి అరెస్టయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు. దీంతో CMను అరెస్ట్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లను మాత్రమే పదవిలో ఉండగా అరెస్ట్ చేయరాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరని పేర్కొన్నారు. PM, CMలను చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.