India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గేమ్ ఛేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేర్కొన్నారు. లక్నోలో జరిగిన మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘డైరెక్టర్ శంకర్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన్ను మిస్ అవుతున్నాం. నా గత సినిమాను లక్నో ప్రజలు ఆదరించారు. గేమ్ ఛేంజర్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.

TG: ప్రజలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఎప్పుడో మర్చిపోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకునే వారిని తెలంగాణ సమాజం నాయకుడిగా భావించబోదని అన్నారు. మహారాష్ట్రలో రేవంత్ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. మరోవైపు నక్సలిజం భావాలున్న వారికి విద్యాకమిషన్‌లో చోటు కల్పిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే విద్యాకమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను చట్టవిరుద్ధంగా, అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని YS జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను దెబ్బతీశారు. ఆయనకు కొరుకుడుపడనిది సోషల్ మీడియా ఒక్కటే. పోలీసులను వాడుకుంటూ YCP కార్యకర్తలను హింసిస్తున్నారు. ఫేక్ పోస్టులు చేసిన టీడీపీ అఫీషియల్ అకౌంట్‌పై చర్యలు తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు.

అమెరికాలో ట్రంప్ గెలవడం పురుషులపై మహిళల కోపానికి కారణమైంది. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పురుషుల ఓట్ల వల్లే ట్రంప్ గెలిచారని భావిస్తూ వారితో పెళ్లి, శృంగారం, పిల్లలు వంటి బంధాలు పెట్టుకోమని కొందరు మహిళలు ఉద్యమిస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియా ట్రెండ్ అని, ఉద్యమం కాదని మరికొందరు అంటున్నారు.

AP: ఈనెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అదే రోజున ఉ.9 గంటలకు భేటీ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. క్యాబినెట్ ఆమోదించిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

కన్నడ నటుడు యశ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’లో పోరాట సన్నివేశాల కోసం ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి బ్లాక్‌బస్టర్ల యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ పనిచేయనున్నారు. మూవీ కోసం ఆయన తాజాగా భారత్‌కు చేరుకున్నారు. టాక్సిక్‌లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాకు తెలిపారు. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యశ్ సరసన కియారా నటిస్తున్నారు.

జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దని, డీలా పడిపోవద్దని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సూచించారు. సమస్యలున్నా చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాకు కేవలం 30 బంతుల్లో 30 రన్స్ కావాలి. మేం గెలుస్తామని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పరిస్థితి కష్టమే కానీ భారత్ గెలిచింది. జీవితంలోనైనా అంతే. పోరాటం ఆపకూడదు’ అని పేర్కొన్నారు.

AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో మంగళ, బుధ వారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కెనడాలో చదవాలనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు షాకిచ్చింది. త్వరగా వీసాను ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(SDS) పథకాన్ని రద్దు చేసింది. దీంతో భారత్‌తో పాటు 13 దేశాల విద్యార్థులు ఇకపై సాధారణ స్టడీ పర్మిట్ సిస్టమ్‌లో వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ లక్ష్యంగానే ట్రూడో సర్కారు ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ చెప్పిన పలు కథల్లో ఒకదాన్ని ఆయన ఓకే చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాను నిర్మించేందుకు రెండు పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని, త్వరలో అధికారికంగా ప్రకటన విడుదల కానుందని తెలిపాయి. ఇటు తారక్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్ చేస్తున్నారు. తర్వాత నీల్ మూవీ చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.