News March 27, 2024

ధోనీ అందుకే బ్యాటింగ్‌కు రాలేదు: హస్సీ

image

IPL-2024లో ఇప్పటివరకు CSK ఆడిన 2 మ్యాచుల్లో ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆయన ఒక్క బాల్ కూడా ఆడలేదు. దీనిపై బ్యాటింగ్ కోచ్ హస్సీ స్పందిస్తూ ‘ఇంపాక్ట్ రూల్ వల్ల బ్యాటింగ్ ఆర్డర్ లెంగ్త్ ఎక్కువైంది. అందుకే ధోనీ 8వ స్థానంలో రావాల్సి వస్తోంది. మరోవైపు ఫాస్ట్‌గా ఆడాలని బ్యాటర్లకు హెడ్ కోచ్ ఫ్లెమింగ్ సూచించారు. అందుకే ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని వివరించారు.

News March 27, 2024

చెర్రీకి తారక్ విషెస్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా సోదరుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు సంతోషం, విజయం కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. అటు సినీప్రముఖులు, అభిమానులు చెర్రీకి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

News March 27, 2024

వాలంటీర్లపై ఈసీకి బీజేపీ విజ్ఞప్తి

image

AP: వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికలయ్యే వరకు పెన్షన్ విషయంలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై జిల్లా కలెక్టర్లు వేటు వేస్తున్న సంగతి తెలిసిందే.

News March 27, 2024

ఆ కంటైనర్ ఎందుకు తనిఖీ చేయలేదు: లోకేశ్

image

AP: రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన రూ.వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం చెబుతారా డీజీపీ?’ అని ట్వీట్ చేశారు.

News March 27, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా చికుర్‌బట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతాబలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News March 27, 2024

రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన?

image

తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుందట. ప్రస్తుతం 33 జిల్లాలుండగా వాటిని 17కు కుదించే అవకాశం ఉందని సమాచారం. ఏపీ తరహాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.

News March 27, 2024

గుజరాత్ కెప్టెన్‌కు జరిమానా

image

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. నిన్న సీఎస్కేతో మ్యాచు‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్ గిల్ కావడం గమనార్హం.

News March 27, 2024

కుప్పంలో చంద్రబాబుకు ఓటమే: VSR

image

AP: ఈ సారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘కుప్పం ఇప్పుడు టీడీపీకి కంచుకోట కాదు. చంద్రబాబు ఓట్ల శాతం తగ్గిపోతోంది. 1999లో 74% ఉండగా, 2004లో 70%, 2009లో 61.9%, 2019లో 55%కి తగ్గింది. టీడీపీ మాటలు మాత్రమే చెబుతుందని, పనులు చేయదని కుప్పం ప్రజలు తెలుసుకున్నారు. కుప్పం నుంచే వైసీపీ విజయప్రస్థానం ప్రారంభం కాబోతుంది’ అని VSR ట్వీట్ చేశారు.

News March 27, 2024

నేను టీడీపీలోనే ఉంటా: మాగంటి బాబు

image

AP: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు స్పందించారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు కార్యకర్తలతో అన్నారు.

News March 27, 2024

రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

image

TG: రేపు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, BRS నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.