India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SAతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4)తో పాటు సూర్య (4), రింకూ సింగ్ (9) ఫెయిల్ అయ్యారు. తిలక్ 20, అక్షర్ 27, హార్దిక్ 39* రన్స్ చేశారు.

కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.

☞ ఆర్థికశాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్
☞ మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబు
☞ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
☞ కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
☞ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత

TG: కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కులగణన చేశారని, మళ్లీ అవసరం లేదని చెప్పారు. గత సర్వే నివేదిక ప్రస్తుత ప్రభుత్వానికి అందలేదా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

భారత్‌కు మోదీ, షా నుంచే ప్రమాదం పొంచి ఉందని AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజాగా వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ కులాల ప్రాతిపదికన విభజిస్తోందని PM చేసిన విమర్శలపై ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘దేశాన్ని మతం, కులం పేరిట విభజించేది బీజేపీ వాళ్లే. మేం మనుషుల్ని ఏకం చేస్తాం. అలా ఏకం చేయడం కోసమే ఇందిర ప్రాణత్యాగం చేశారు. భారత్‌కు ముప్పు ఉందంటే అది బీజేపీ వల్లే’ అని మండిపడ్డారు.

చంద్రబాబు సీప్లేన్‌పై కహానీలు మొదలుపెట్టారని YS జగన్ విమర్శించారు. సీప్లేన్ ఇప్పటిది కాదని 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచిందని తెలిపారు. ‘గుజరాత్, కేరళల్లో ఇప్పటికే నడిపి ఆపేశారు. దీన్ని అభివృద్ధికి ప్రమాణంగా చెప్పుకోవడం డప్పాలు కొట్టుకోవడం కాదా? మేం రూ.8,480 కోట్లతో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. 14 మెడికల్ కాలేజీలు కట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు నిర్మించాం’ అని ట్వీట్ చేశారు.

నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 14 వరకు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 4 రోజుల వాతావరణ వివరాల కోసం <

AP: ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని Dy.CM పవన్ అన్నారు. కానీ పరిమితులు దాటి కుటుంబాలు, కుల మతాలు, దేవతలను దూషించడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. దేహబలం, డబ్బు, క్రిమినల్స్ సపోర్ట్ ఉందని బెదిరిస్తే, భయపడటానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని సోషల్ మీడియా దుర్వినియోగదారులు ఇతరులను తిట్టేముందు 100సార్లు ఆలోచించుకోవాలన్నారు. కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.

బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న గంభీర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురవ్వడంపైనా ఆయన స్పందించే అవకాశం ఉంది. BGTలో తొలి టెస్టు ఈ నెల 22న పెర్త్‌లో మొదలుకానుండగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయలుదేరారు.

హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ నిజ్జర్ సహాయకుడు అర్షదీప్ డల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. గత నెల 27-28 తేదీల్లో హాల్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు సంబంధించి డల్లాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డల్లా తన భార్యతో కలిసి సర్రేలో నివసిస్తున్నాడు. అతడిపై భారత్‌లో కిడ్నాప్, హత్య, ఉగ్రవాద సంబంధిత కేసులు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.