India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రేపటి నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. తొలుత ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజులు యాత్ర కొనసాగించనున్నారు. వైజాగ్, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగనుంది.
చైనాకు చెందిన ఝౌ చునా(18) అనే యువతి తన అభిమాన నటి ఎస్తేర్‌లా కనిపించాలని 100కుపైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. ఈ శస్త్ర చికిత్సల కోసం ఏకంగా ₹4 కోట్లు ఖర్చు చేశారు. 13 ఏళ్ల వయస్సు నుంచి ప్రతిసారీ కొత్త వైద్యులను సంప్రదిస్తూ ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. ప్రస్తుతం ఎవరూ గుర్తించలేనంతగా ఆమె మొఖం మారడంతో ఆ రూపం తల్లిదండ్రులకీ నచ్చలేదు. దీంతో తాజాగా సర్జరీ ప్రయత్నాలను విరమించుకున్నారు.
భారత ఫుట్‌బాల్ జట్టుకు పసికూన అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత్ 1-2తేడాతో అఫ్గాన్ చేతిలో ఓడింది. ఇది ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీకి 150వ మ్యాచ్ కావడం విశేషం. ఇందులో సునీల్ తన కెరీర్‌లో 94వ గోల్ కూడా కొట్టారు. ఇది భారత ఫుట్‌బాల్ జట్టు చరిత్రలో ఘోరమైన ఓటమిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇండియాలో 2.25మిలియన్ల వీడియోలను తొలగించింది. 2023లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన వీడియోలను తొలగించినట్లు తెలిపింది. వీడియోలు తొలగించిన దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సింగపూర్ 12,43,871 వీడియోలతో రెండో స్థానంలో ఉంది. అమెరికా(7,88,354) మూడో స్థానంలో ఉంది.
అస్సాంలోని తేజ్‌పుర్ నియోజకవర్గంలో ఉన్న నేపాలీ పామ్ గ్రామంలో ఒకే కుటుంబంలో 1,200 మంది ఓటర్లు ఉన్నారు. రాన్ బహదూర్ థాపా అనే గోర్ఖాకు ఐదుగురు భార్యలు, 12 మంది కొడుకులు, 10 మంది కూతుళ్లు. వీరి కుటుంబం విస్తరించి ఇప్పుడు 2,500 మంది సభ్యులు ఉండగా.. వారిలో దాదాపు 1,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా 300 ఇళ్లలో నివసిస్తున్నారు. కాగా వీరంతా కుటుంబ పెద్ద టిల్ బహదూర్ థాపా ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తారు.
రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువగా తింటే మరీ మంచిదని అంటున్నారు. గుడ్లు తినడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు కూడా రావని పేర్కొంటున్నారు. అలాగే గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. తొడ, కటి వెన్నెముక భాగాల్లోని ఎముకలు దృఢంగా మారతాయని అంటున్నారు. గుడ్డు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొంటున్నారు.
AP: ఏలూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ పుట్టా మహేశ్ యాదవ్‌కు దక్కడంతో అసంతృప్తిగా ఉన్న మాగంటి బాబు.. పార్టీ అగ్రనాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారట. వైసీపీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 1998, 2014లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.
TG: సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనగా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులపై చర్చిస్తున్నారు. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా దుమ్మురేపుతోంది. రూ.200 కోట్ల కలెక్షన్ల మార్కు దాటిన తొలి మలయాళ మూవీగా చరిత్ర సృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‍లో వస్తుందా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న థియేటర్లలోకి రానుంది. ఇక ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. మయాంక్ అగర్వాల్‌ను ఆటపట్టించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా మయాంక్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇటీవల కోల్‌కతాతో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం బౌలర్ హర్షిత్ రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. రోహిత్.. ఆ ఘటనను గుర్తు చేస్తూ ఇమిటేట్ చేశారు.
Sorry, no posts matched your criteria.