News November 11, 2024

ఆటగాళ్ల వ్యక్తిత్వ హననం తగదు: అశ్విన్

image

జట్టు ఓటమి విషయంలో ఫ్యాన్స్‌కంటే ఆటగాళ్లు రెట్టింపు బాధను అనుభవిస్తారని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఓడిపోయామని తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఆట. గెలుపోటములు సహజం. అభిమానుల కంటే ఎక్కువ బాధ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది. మైదానంలో ఫలితాలపైనే మా కెరీర్లు ఆధారపడి ఉంటాయి. అలాంటి మా నిబద్ధతను అనుమానించడం చాలా దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 11, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:41 గంటలకు ✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 11, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: నవంబర్ 11, సోమవారం ✒ దశమి: సాయంత్రం 06.46 గంటలకు ✒ శతభిష: ఉ.09.40 గంటలకు ✒ వర్జ్యం: మా.03.35-05.04 గంటల వరకు ✒ దుర్ముహూర్తం: మ.12.14-12.59 గంటల వరకు, మ. 2.30-3.16

News November 11, 2024

TODAY HEADLINES

image

☛ AP: తగిన వ్యక్తులకే నామినేటెడ్ పదవులు ఇచ్చాం: CM CBN
☛ IASలకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు: పవన్
☛ అమరావతికి ₹15,000కోట్ల రుణం.. నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు
☛ సీప్లేన్‌పై CBN కహానీలు చెబుతున్నారు: జగన్
☛ త్వరలో నారాయణ్‌పేట్-కొడంగల్ ప్రాజెక్టు పూర్తి: CM రేవంత్
☛ బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం: KTR
☛ గ్రూప్-3 హాల్‌టికెట్లు విడుదల
☛ రెండో టీ20లో INDపై సౌతాఫ్రికా గెలుపు

News November 11, 2024

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ గెలుపు

image

శ్రీలంకతో 2వ టీ20లో న్యూజిలాండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 19.3 ఓవర్లలో 108 రన్స్ చేసి ఆలౌటైంది. 109 రన్స్ లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 103 రన్స్ వద్ద కుప్పకూలింది. దీంతో కివీస్ 5 రన్స్ తేడాతో గెలుపొందింది. చివరి 6 బంతుల్లో 8 రన్స్ కాపాడుకోవాల్సిన దశలో న్యూజిలాండ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ 2 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఫస్ట్ T20లో శ్రీలంక గెలిచింది.

News November 11, 2024

ఆహారం వృథా కాకుండా జొమాటో కొత్త పథకం

image

ఆహారం ఆర్డర్ చేసిన వారు వివిధ కారణాలతో దాన్ని రద్దు చేసుకున్నప్పుడు అది వృథా అవుతుంటుందన్న సంగతి తెలిసిందే. ఆ వృథాను అరికట్టేందుకు కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఎవరైనా రద్దు చేసుకున్న ఆర్డర్‌ను ఆ తర్వాతి 2 లేదా 3 నిమిషాల్లో తక్కువ ధరకు వేరే వినియోగదారులకు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీన్ని ‘ఫుడ్ రెస్క్యూ’గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

News November 11, 2024

గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమ్ ఇండియా

image

టీమ్ ఇండియాతో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 125 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత తడబడ్డ సౌతాఫ్రికా చివర్లో అదరగొట్టింది. స్టబ్స్(41 బంతుల్లో 47*), కోయెట్జీ(9 బంతుల్లో 19*) మరో ఓవర్ మిగిలి ఉండగానే తమ జట్టుకు విక్టరీని అందించారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో సత్తా చాటినా ప్రయోజనం లేకపోయింది.

News November 11, 2024

ఐదు వికెట్లు తీసిన వరుణ్

image

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. టీ20Iల్లో 5 వికెట్లు తీయడం ఆయనకిదే తొలిసారి. మొత్తంగా 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీయడం గమనార్హం.

News November 11, 2024

భారీ భూకంపం.. వణికిన క్యూబా

image

క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. బార్టోలోమోకు 40 కి.మీ దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఆ సమీపంలోని మంజనిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు.