India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికలు వస్తే ఐదేళ్లు పట్టించుకోని నేతలు సైతం చకాచకా ఓటర్లు అడిగినవి చేసి పెట్టేందుకు సిద్ధమైపోతారు. ఓటు విలువ అలాంటిది మరి. ఇది గ్రహించిన నోయిడా ప్రజలు తమ అపార్ట్‌మెంట్‌ల ముందు ‘నో రిజిస్ట్రీ, నో వోట్’ అని బోర్డులు తగిలిస్తున్నారు. తమ కష్టార్జితంతో కొన్న ఇళ్లకు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తమ డిమాండ్‌ను ఇలా తెలియజేస్తున్నారు. వీరిలో కొందరు 10ఏళ్లుగా పట్టా కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం.
పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు చైనీయులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగింది. చైనాకు చెందిన కొంతమంది ఇంజినీర్లు ఇస్లామాబాద్ నుంచి దాసుకు తమ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగి ఆరుగురు చైనీయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్-XII) 2,049 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఈ నెల 18తోనే అప్లికేషన్ గడువు ముగిసినా 26వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పోస్టులను బట్టి ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మే 6-8 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా తీవ్రమైనది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి ముఖ్యమంత్రే బాధ్యులు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారు’ అని ఆయన ఆరోపించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన లోక్‌సభ స్థానాల భర్తీపై అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. సీఎం ఒక్కరే హస్తిన పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 MP స్థానాలకు గానూ తొమ్మిదింటికి అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసే ఏడో జాబితాలో మిగతా పేర్లను ప్రకటించనున్నారు.
TG: మ్యాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లలో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొఫైల్ చూసి నమ్మి మోసపొవద్దని సూచిస్తున్నారు. ‘ఇలాంటి వేదికల్లో పరిచయమైన వారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్‌లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది’ అని ట్వీట్ చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో తన రిమాండును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఈ నెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.
నిన్న PBKSతో మ్యాచ్ సందర్భంగా RCB బౌలర్ యశ్ దయాల్‌పై కామెంటేటర్ మురళీ కార్తీక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరి చెత్త.. మరొకరికి నిధిలా మారుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ అంశంపై RCB స్పందిస్తూ.. ‘అవును.. అతను మా నిధే’ అని రిప్లై ఇచ్చింది. గత సీజన్‌లో GT తరఫున ఆడిన దయాల్ ఓవర్లో రింకూ సింగ్(KKR) 5 సిక్సులు బాదిన విషయం తెలిసిందే.
టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న రొమాంటిక్ క్రైమ్ కామెడీ ‘టిల్లు స్క్వేర్’ ఈనెల 29న రిలీజ్ కానుంది. ఈక్రమంలో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రేపు టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.
TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని IMD తెలిపింది. రాబోయే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని అంచనా వేసింది.
Sorry, no posts matched your criteria.