News September 27, 2024

AP, TGల్లో టాప్ టూరిస్ట్‌ స్పాట్లు

image

బిజీబిజీ లైఫ్‌లో కాస్త టైం ఫ్యామిలీకీ కేటాయిద్దాం. అలా బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుందాం. అప్పుడే వర్క్-ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. APలో అరకులోయ, బెలుం, బొర్రా గుహలు, అంతర్వేది, ఆక్టోపస్ వ్యూ, పాపికొండలు ఉన్నాయి. TGలో HYD, 1000స్తంభాల గుడి, కుంటాల జలపాతం, ఉమా మహేశ్వరం.
> నేడు వరల్డ్ టూరిజం డే.

News September 27, 2024

రికార్డు బ్రేకింగ్ దిశగా US వెళ్లే భారతీయుల సంఖ్య

image

ఈ ఏడాది అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య రికార్డు సృష్టించనుంది. ఆగస్టు నాటికే 15.5 లక్షల మంది వెళ్లారు. ట్రెండ్ ఇలాగేఉంటే గతేడాది నమోదైన 17.6 లక్షల రికార్డు బ్రేకవ్వడం ఖాయమే. స్టూడెంట్ సీజన్ సెప్టెంబర్లో ముగుస్తుంది. US సెటిలర్స్‌ను చూసేందుకు వెళ్లే కుటుంబీకులు, బిజినెస్, ఎంప్లాయిస్ ట్రిప్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షలు దాటడం సులువే. కొవిడ్‌కు ముందు 2019లో 14.7 లక్షల మంది అక్కడికి వెళ్లారు.

News September 27, 2024

తిరుమలకు జగన్ వస్తుంటే మా నేతలకు నోటీసులా?: YCP

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో కూట‌మి స‌ర్కార్ ఆంక్ష‌లు విధిస్తోందని YCP మండిపడింది. ‘జిల్లాలో 30 యాక్ట్ అమ‌లులో ఉందంటూ మా నాయకులకు అర్ధ‌రాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సంద‌ర్భాలు లేవు. ఈ ప్ర‌భుత్వం వచ్చాక ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు’ అని ట్వీట్ చేసింది.

News September 27, 2024

దివ్యాంగులకు గుడ్‌న్యూస్

image

AP: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల ఇళ్లకే వెళ్లి సేవలు అందించనుంది. ఇందుకోసం మొబైల్ ప్రోస్థటిక్స్ & ఆర్థోటిక్స్ వ్యాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే అవసరమైన పరికరాలతో పాటు తయారీ నిపుణులుంటారు. కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి కొలతలు తీసుకుని ఒకరోజులోనే తయారు చేసిస్తారు.

News September 27, 2024

డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ

image

మినిస్ట్రీల పనితీరుపై దృష్టిపెట్టే పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటైనట్టు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కమిటీలో రాహుల్‌ గాంధీకి చోటు దక్కింది. సోనియా ఎందులోనూ లేరు. ఫైనాన్స్‌ను భర్తృహరి, విదేశాంగను శశి థరూర్ నడిపిస్తారు. TDP, JDU, శివసేన, NCPకి ఒక్కో కమిటీలో నాయకత్వం దక్కింది. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, పంచాయితీ రాజ్‌కు కాంగ్రెస్ నేతలే సారథులు.

News September 27, 2024

అత్యాచారం కేసు.. పరారీలో హర్షసాయి

image

అత్యాచార కేసు నమోదైన యూట్యూబర్ హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్‌తో పాటు సీసీఫుటేజీ, ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

News September 27, 2024

క్రికెట్‌కు డ్వేన్ బ్రావో వీడ్కోలు

image

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా 41 ఏళ్ల బ్రావో 2015లో టెస్టులు, 2021లో వన్డేలు, టీ20లకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన ఫ్రాంచైజీ క్రికెట్‌కు స్వస్తి పలికారు. 582 టీ20ల్లో 6,970 పరుగులతోపాటు 631 వికెట్లు కూడా పడగొట్టారు. IPLలో 161 మ్యాచ్‌లు ఆడారు.

News September 27, 2024

IND vs BAN: టాస్ ఆలస్యం

image

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరగనున్న రెండో టెస్టులో టాస్ ఆలస్యం కానుంది. మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. 9.30 గంటలకు టాస్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న వర్షం కురిసినా మైదానాన్ని ఆరబెట్టడంలో సిబ్బంది విఫలమైనట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ టెస్టు మ్యాచ్ కూడా ఇదే రీతిలో రద్దయ్యింది.

News September 27, 2024

రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్: SS కార్తికేయ

image

రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని జక్కన్న కుమారుడు SS కార్తికేయ పేర్కొన్నారు. ‘23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే మొదలైందో ఆయనతోనే ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. NTRను దగ్గరి నుంచి చూస్తూ పెరగడం, ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి ఇది’ అని తెలిపారు.

News September 27, 2024

అవును.. PM ఆఫర్లు వచ్చాయి: నితిన్ గడ్కరీ

image

తనకు చాలాసార్లు పీఎం ఆఫర్లు వచ్చాయని BJP అగ్ర‌నేత నితిన్ గడ్కరీ అన్నారు. ఆ పోస్టు తీసుకుంటానంటే ఓ అపోజిషన్ పార్టీ లీడర్ సపోర్టు చేస్తానన్న వార్తలపై ఇండియా టుడే కాంక్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘LS ఎలక్షన్లకు ముందు, తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. నా ఐడియాలజీని వదిలేయలేను. అందుకే వాటిని అంగీకరించే ప్రశ్నే రాలేదు. పీఎం అవ్వడం నా లక్ష్యం కాదు. నా ఐడియాలజీపై నమ్మకంతో బతుకుతున్నా’ అని అన్నారు.