India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘కామన్ డీపీ’ని విడుదల చేసింది. ‘ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని విడుదల చేశాం. తన అభిరుచి, నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు’ అని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఆయన ఫ్యాన్స్ అంతా తమ సోషల్ మీడియా డీపీలో ఈ పోస్టర్‌ను ఉంచనున్నారు.
ఐపీఎల్ 2024 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులు HYDలో ఖరారు కాగా, రెండో షెడ్యూల్‌లో మరో ఐదు మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్ 25న ఆర్సీబీ, మే 2న రాజస్థాన్, 8న LSG, 16న గుజరాత్, 19న పంజాబ్‌తో SRH తలపడనుంది. తొలి షెడ్యూల్‌లో ఉప్పల్ వేదికగా ఈ నెల 27న ముంబై, ఏప్రిల్ 5న సీఎస్కేతో SRH తలపడనున్న సంగతి తెలిసిందే. వైజాగ్ వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న రెండు మ్యాచులు జరగనున్నాయి.
తనను ‘వేశ్య’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనతేపై కంగన ఫైర్ అయ్యారు. ‘ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో నేను అన్ని రకాల పాత్రలు పోషించాను. సెక్స్ వర్కర్లను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళా ఆత్మగౌరవం కోరుకుంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. కంగనాను MP అభ్యర్థిగా BJP ప్రకటించిన నేపథ్యంలో సుప్రియ ఆ పోస్టు చేశారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఉదయం 11 గంటలకు ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కవితకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత లాయర్లు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ ఆమెను కలిశారు.
TG: సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ట్యాపింగ్ హార్డ్ డిస్క్‌లను మూసీలో పడేసినట్లు నిందితుడు ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నాగోలు మూసీ వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకుని FSLకు పంపించారు. ఈ కేసులో పోలీసులు ఏ-1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగరావు, ఏ-3గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.
TG: సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడితో హోలీ ఆడారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో మనువడు రియాన్స్‌కు సీఎం రంగులు పూస్తూ సరదాగా గడిపారు. వారితో పాటు సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి కూడా సంబరాల్లో పాల్గొన్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ‘హార్దిక్ చింతించకండి. ముంబై అభిమానిగా నేను మీకు మద్దతిస్తున్నా. మొదటి గేమ్‌లో ఓడిపోవడం ముంబై ఇండియన్స్‌కు అలవాటే. నిన్న కూడా అదే రిపీటైంది. ఇది కేవలం మొదటి గేమ్ మాత్రమే. మీరు కమ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మిగతా షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి
హోలీ అంటే హిందువుల పండుగ అని మనకు తెలుసు. అయితే.. ముస్లింలు కూడా హోలీ చేసుకునేవారని మీకు తెలుసా? మొఘల్ కాలంలో ముస్లిం ప్రజలు హోలీని ఈద్-ఎ-గులాబీ(పింక్ ఈద్), ఆబ్-ఇ-పాషి (రంగుల పూల వర్షం) పేరుతో చేసుకునేవారు. ఆగ్రా, ఎర్రకోట వద్ద హిందూ, ముస్లింలతో కలిసి మొఘల్ చక్రవర్తులు అక్బర్, జహంగీర్ హోలీ ఆడేవారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ అధికారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేకే.మహమ్మద్ వెల్లడించారు.
బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. జెర్సీపై మద్యం కంపెనీ లోగోను వేసుకునేందుకు నిరాకరించారు. మతపరమైన కారణాలతో ఆయన ఈ లోగోను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో జెర్సీపై ఆ లోగో లేకుండానే బరిలోకి దిగారు. గతంలో ఆమ్లా, మొయిన్ అలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాగే బరిలోకి దిగారు.
Sorry, no posts matched your criteria.