India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కాపాడింది తమ పార్టీయేనని బాబు గుర్తు చేశారు.
రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో రెండో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి DSPనే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేస్తారని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. రంగస్థలంను మించే సినిమా రాబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుండగా.. బుచ్చిబాబుతో సినిమా చేయాల్సి ఉంది.
ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో విజయంతో ఖాతా తెరిచేందుకు ఆర్సీబీ ఎదురు చూస్తోంది. తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి గొప్ప ప్లేస్ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. జట్టులోని ప్లేయర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 84 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 39 విజయాలు, 40 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ సరదాగా గడిపారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా హోలీ ఆడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన భర్త నికోలస్‌తో పండుగ జరుపుకున్నారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర & రకుల్ దంపతులు, తన పెట్స్‌తో సమంత తదితరుల సెలబ్రేషన్ ఫొటోస్ మీకోసం.
TG: ధరణిలో లోపాలున్నాయని, వాటిని తాము గుర్తించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘4 నెలల క్రితం ధరణిలో లోపాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు. చట్ట ప్రకారం రైతుల భూములు పట్టాలు చేయాలి. అద్భుతంగా నడిచిన ధరణిని కొనసాగించాలి. రైతుల ఉసురు పోసుకోవద్దు’ అని అన్నారు.
AP: పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని కాకినాడ జనసేన అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ‘ఈ నెల 31 నుంచి పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. పవన్‌కు సవాల్ విసరాలంటే ద్వారంపూడికి స్థాయి ఉండాలి. మా నాయకుడికి భయపడి వైసీపీ మండలానికో ఇన్‌ఛార్జ్‌ని నియమించింది. ముద్రగడ వైసీపీ కోసమే పనిచేశారు. అందుకే ఆ పార్టీలో చేరారు’ అని తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య లక్ష్యంగా ఫ్యాన్స్ హేళన చేశారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించారు. తన జీవితంలో ఏ భారత క్రికెటర్‌ను ఇంతలా హేళన చేయడం చూడలేదని అన్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పాండ్యను ఉద్దేశిస్తూ ఫ్యాన్స్ గేలి చేస్తూ కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AP: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరారు.
TG: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట పలు జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి పూట 26 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని పేర్కొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడం గమనార్హం.
AP: జగన్ గొడ్డలితో తెగబడితే, YCP కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘సత్యసాయి జిల్లా కుటాలపల్లిలో TDP కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. అది ముమ్మాటికీ YCP సైకోల పనే. ఓటమి భయంతో మా కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారు. YCP కాలకేయులకు ఇదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.