News March 24, 2024

జనసేన పెండింగ్ స్థానాలివే!

image

AP: టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన జనసేన మూడింటిని పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News March 24, 2024

రాహుల్‌పై పోటీ చేసేది ఎవరంటే?

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఆయనపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ పోటీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ ఆయన పేరును చేర్చింది. 2019లో సురేంద్రన్ పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

News March 24, 2024

విచిత్ర సమస్య.. పడుకుంటే నెల పాటు లేవరు!

image

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామ ప్రజలు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. అది కూడా మామూలుగా కాదండోయ్.. పడుకుంటే కుంభకర్ణులే. ఒక్కసారి పడుకుంటే కనీసం నెలపాటు నిద్రిస్తారు. పెద్ద డీజే సౌండ్ పెట్టి లేపినా లేవరు. నిద్ర లేచాక వారు ఎంతసేపు పడుకున్నారో కూడా తెలియదట. దీనికి కారణం కలుషిత నీరు తాగటమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రామ సమీపంలో యురేనియం గనులు ఉండటంతో నీటిలో కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఇలా జరుగుతోందట.

News March 24, 2024

111 మందితో ఐదో జాబితా విడుదల

image

బీజేపీ 111 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నవీన్ జిందాల్‌(కురుక్షేత్ర), కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు చోటు కల్పించింది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్(పాట్నా సాహిబ్), గిరిరాజ్ సింగ్(బెగుసరాయ), ధర్మేంద్ర ప్రధాన్‌(సంబల్‌పూర్)తో పాటు మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్), హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్(దుమకా) జాబితాలో ఉన్నారు.

News March 24, 2024

జలగంకు బీజేపీ షాక్

image

TG: ఇటీవల BJPలో చేరిన జలగం వెంకటరావుకు షాక్ తగిలింది. ఖమ్మం నుంచి ఎంపీ సీటు ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. తాజా జాబితాలో ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పేరును బీజేపీ ప్రకటించింది. టికెట్ ఆశించి బీజేపీలో చేరిన వెంకట్ రావు ముందు నుంచి ఖమ్మం స్థానం తనదేనని ధీమాతో ఉన్నారు. కొత్తగూడెంకు చెందిన వ్యాపారవేత్త వినోద్ రావుకు ఈ స్థానంలో టికెట్ ఇవ్వడంతో జలగం పరిస్థితి అయోమయంగా మారింది.

News March 24, 2024

వయాగ్రాతో ఎక్కువ కాలం జీవించొచ్చు!

image

లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా.. మనిషి మరింత ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. వయాగ్రాలో ఉండే పవర్‌ఫుల్ కెమికల్ సిల్డెనాఫిల్ ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇది మరణం సంభవించే ప్రమాదాన్ని 15%, అల్జీమర్స్‌ రిస్క్‌ని 18% తగ్గిస్తుందట. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. కాగా వైద్యుల సూచనలతోనే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి.

News March 24, 2024

IPL: ముంబై ఇండియన్స్ టార్గెట్ 169

image

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో గుజరాత్ జట్టు 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. సాయి సుదర్శన్(45), గిల్(31) మాత్రమే రాణించారు. ముంబై జట్టులో బుమ్రా 3, కోయెట్జీ 2, చావ్లా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

News March 24, 2024

స్టార్ హీరోయిన్‌కు టికెట్ ఇచ్చిన BJP

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇటీవల ఆమెకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంతో.. ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రామాయణ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్‌ UPలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు.

News March 24, 2024

చరిత్ర సృష్టించాడు

image

శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించారు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన మెండిస్, రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకాన్ని నమోదు చేశారు. దీంతో శ్రీలంక భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

News March 24, 2024

జనసేన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

image

* రాజోలు – దేవ వరప్రసాద్
* తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
* భీమవరం – పులపర్తి ఆంజనేయులు
* నరసాపురం – బొమ్మిడి నాయకర్
* ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
* పోలవరం – చిర్రి బాలరాజు
* తిరుపతి – ఆరణి శ్రీనివాసులు
* రైల్వే కోడూరు – యనమల భాస్కరరావు