News March 24, 2024

ఈ ప్లేయర్లకు శాలరీ హైక్

image

ఐపీఎల్ ఆడుతున్న పలువురు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రింకూ సింగ్, జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌లకు ఐపీఎల్‌లో శాలరీని పెంచింది. రూ.55 లక్షలకే గత సీజన్‌ ఆడిన రింకూ సింగ్ ఈ ఏడాది రూ.కోటి అందుకోనున్నారు. జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్‌ల శాలరీ కూడా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరగనుంది. ఈ మొత్తాన్ని ఆయా ఫ్రాంచైజీలు చెల్లించనున్నాయి.

News March 24, 2024

APPLY: 1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

image

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టుల వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్: https://nvs.ntaonline.in/

News March 24, 2024

పవన్ మెజార్టీ లక్షకు తగ్గదు: ఉదయ్

image

AP: పిఠాపురంలో సీఎం జగన్ వచ్చి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ మెజార్టీ లక్షకు మెజార్టీ తగ్గదని జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ‘ఇప్పటికే పవన్‌ను ఓడించడానికి ముగ్గురు సీనియర్ నేతలను దింపారు. మూడు వేల మందిని పంపినా సరే పవన్‌ను ఓడించలేరు. మేం చేస్కోవాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు.

News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తాం: కోటంరెడ్డి

image

AP: సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఇతర పార్టీల నేతలను వేధిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విపక్ష నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ అంశంపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఏడాది కిందటే తాను ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయటపెట్టానని గుర్తు చేశారు.

News March 24, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

image

AP: రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అరకు-కొత్తపల్లి గీత, రాజమండ్రి-దగ్గుబాటి పురందీశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, తిరుపతి-డా.వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ బరిలో నిలవనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై బీజేపీ అధిష్ఠానం త్వరలోనే అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.

News March 24, 2024

బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ RKS బధౌరియా బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ మోదీ లీడర్‌షిప్‌లో గడిచిన ఎనిమిదేళ్లు నా సర్వీస్‌లో ఉత్తమం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు సాయుధ బలగాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి’ అని బధౌరియా అన్నారు.

News March 24, 2024

అయోధ్య రాముడి LATEST PHOTOS

image

హోలీ పండుగ సందర్భంగా అయోధ్య బాలరాముడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి హోలీ పండుగ కావడంతో వివిధ రకాల పూలు, ఆభరణాలతో అలంకరించిన రాముడి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర సోషల్ మీడియాలో పంచుకుంది.

News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్.. ఎవరూ నోరు మెదపరే?

image

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో SIB డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌ రావును అరెస్ట్ చేసి కూపీ లాగగా.. ఏస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్లు బయటికొచ్చాయి. తాజాగా వారినీ రిమాండ్‌కు తరలించారు. ఇంత జరుగుతున్నా.. అధికార, విపక్షాలు మౌనంగా ఉండటం గమనార్హం. అయితే సైలెంట్‌గా దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయలను’ బయటికి లాగాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.

News March 24, 2024

తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలి: KTR హెచ్చరిక

image

TG: కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని మాజీ మంత్రి KTR ధ్వజమెత్తారు. ‘తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో అబద్ధాలను చూపిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా నన్ను, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో జరుగుతోంది. ఇప్పటికైనా ఆయా సంస్థలు తమ తీరు మార్చుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నా’ అని X లో పోస్ట్ చేశారు.

News March 24, 2024

BREAKING: టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం

image

TG: జగిత్యాలలో టెన్త్ అమ్మాయిల గంజాయి <<12910567>>కేసులో <<>>సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ అమ్మాయికి గంజాయి ఇచ్చి ఏడాదిగా పలుమార్లు రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌ అనే ముగ్గురు నిందితులను గుర్తించి, పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.