India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జమ్మూకశ్మీర్ రెండోదశ పోలింగులో వలసవెళ్లిన కశ్మీరీ పండితుల్లో 40% ఓటేశారు. వీరికోసం వేర్వేరు ప్రాంతాల్లో 24 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జమ్మూలోని 19 స్టేషన్లలో 40%, ఉధంపూర్‌లో 37%, ఢిల్లీలో 43% ఓటేశారని రిలీఫ్, రిహబిలిటేషన్ కమిషనర్ అరవింద్ కర్వాని తెలిపారు. పురుషులు 3514, మహిళలు 2736 మంది ఓటేశారు. హబాకడల్ నియోజకవర్గంలో 2796 ఓట్లు పోలయ్యాయి. లాల్‌చౌక్‌లో 909, జడిబాల్‌లో 417 ఓట్లు పడ్డాయి.

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను ఇవాళ జనసేనలో చేరనున్నారు. వీరితోపాటు పలువురు నేతలు కూడా పార్టీలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరిందరికీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కండువా కప్పనున్నారు. కాగా ఇటీవల ఈ ముగ్గురు నేతలు పవన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే.

AP: గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి 50% రాయితీ కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కనిష్ఠంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటి ఖర్చుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ కింద యూనిట్ వ్యయంలో 50% రాయితీ వస్తుందన్నారు. 40 శాతం బ్యాంకు రుణం, రైతు 10% వాటా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. గ్రామీణ యువతకు పథకంపై అవగాహన కల్పిస్తామన్నారు.

అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరాన్ని కొందరు దుండగలు అపవిత్రం చేశారు. గోడలపై గ్రాఫిటీతో ‘హిందువులు వెళ్లిపోండి’ అని రాశారు. 10 రోజుల క్రితం న్యూయార్క్‌లోని బాప్స్ ఆలయాన్నీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ హేట్ క్రైమ్స్‌ను సంఘటితంగా ఎదుర్కొంటామని హిందూ సంఘాలు తెలిపాయి. అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఈ దాడుల్ని ఖండించారు.

పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్రం విడుదల చేయనుంది. ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున నగదును జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. రైతులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: <

హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఇటీవల నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు సంప్రదాయం ప్రకారం వేడుకలు జరగాలనేది నా అభిలాష. నా ఫ్యామిలీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తుంది. సన్నిహితుల సమక్షంలో ఆ ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించాలనుకున్నా. నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిందని అనుకోవట్లేదు. నా వరకు కార్యక్రమం పర్‌ఫెక్ట్‌గా పూర్తయింది’ అని తెలిపారు.

AP: రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 16 మంది సభ్యుల జట్టుకు రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్ర తన తొలి మ్యాచ్ అక్టోబర్ 11న విదర్భతో ఆడనుంది. జట్టు: రికీ భుయ్ (C), షేక్ రషీద్ (VC), కేఎస్ భరత్, హనుమ విహారి, నితీశ్, మహీశ్ కుమార్, వంశీకృష్ణ, అభిషేక్ రెడ్డి, శశికాంత్, అశ్విన్ హెబ్బర్, స్టీఫెన్, సత్యనారాయణ, లలిత్ మోహన్, మనీశ్, విజయ్, హేమంతరెడ్డి.

పాడి పరిశ్రమలో ఎఫ్‌టీఏ కింద విదేశీ సంస్థలకు సుంకం రాయితీలు ఇచ్చే ఆలోచన లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. స్విట్జర్లాండ్, నార్వేతో కుదుర్చుకున్న ఈఎఫ్‌టీఏ కింద కూడా ఈ రంగంలో రాయితీలు ఇవ్వలేదన్నారు. ఆస్ట్రేలియాతో ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ అందుకు అంగీకరించలేదని తెలిపారు. భారత్‌లో పాడి పరిశ్రమపై ఎంతో మంది చిన్న రైతులు ఆధారపడి ఉన్నారని, ఇది సున్నితమైన అంశమని పేర్కొన్నారు.

TG: ఆలయాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్‌కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై లడ్డూలు, ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచే నెయ్యి, పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారని తెలిసి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

TG: రానున్న 4 రోజుల్లో కులగణన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ కులగణనను పట్టించుకోలేదని ఆరోపించారు. క్యాస్ట్ సెన్సస్‌కు బీజేపీ వ్యతిరేకమని మహేశ్ మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.